
సాక్షి, హైదరాబాద్ : నకిలీ ధృవపత్రాల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయస్థానం గురువారం సంచలన తీర్పు వెలువరించింది. నారాయణగూడ విజయ బ్యాంక్‌ను మోసం చేసిన ఐదుగురు దోషులకు ఐదేళ్ల చొప్పున శిక్షలను ఖరారు చేస్తున్నట్లు ప్రకటించింది.
విజయ బ్యాంక్ మేనేజర్ రాజగోపాల్‌రెడ్డితోపాటు ఉదయ్ శంకర్, రామంజిరావు, సాయి సీతారాం, అబ్బరాజు వెంకటసుబ్బారావులు నకిలీ పత్రాలతో బ్యాంకుకు కోటి రూపాయలు టోకరా వేసినట్లు ఆరోపణలు ఎదుర్కున్నారు. అవి రుజువైనందున సీబీఐ కోర్టు ఈ తీర్పును ఖరారు చేసింది.