కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం | Fire Accident In Godowns In Kurnool District | Sakshi
Sakshi News home page

కర్నూలులో భారీ అగ్ని ప్రమాదం

Jun 13 2019 8:42 AM | Updated on Jun 13 2019 8:42 AM

Fire Accident In Godowns In Kurnool District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కర్నూలు : ఆత్మకూరు పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోనెసంచుల గోడౌన్‌లో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ఈ ఘటన సంభవించినట్లు తెలుస్తోంది. దీని వల్ల నాలుగు లక్షల మేర ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ గోడౌన్‌కు పక్కనే ఉన్న షాపులోకి మంటలు వ్యాపించడంతో అక్కడి ప్లాస్టిక్‌ పైపులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్లాస్టిక్‌ పైపులు ధగ్దమవడంతో.. లక్ష మేర ఆస్తినష్టం కలిగినట్లు తెలుస్తోంది. ఫైర్‌ సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement