గొంతు నులిమి కొడుకును చంపిన కసాయి తండ్రి..!

Father Kills Son And Committed Suicide In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తండ్రి కర్కశంగా మారాడు. ముక్కుపచ్చలారని ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతునులిమి హతమార్చాడు. అనంతరం తానూ ఉరిపోసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని ముప్కాల్‌ మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతులు.. తండ్రి విజయ్‌ తుల్జారాం, కొడుకు దినేష్‌ రాజస్తాన్‌ వాసులుగా స్థానికులు తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top