భార్య కాపురానికి రావడం లేదని.. | Family Disputes Husband Suicide Attempt In West Godavari | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రావడం లేదని..

May 31 2019 5:12 PM | Updated on May 31 2019 5:16 PM

Family Disputes Husband Suicide Attempt In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ఎదుటే గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌ వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు.. భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో.. ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. భార్య తనతో కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితున్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement