దొంగ బాబా అరెస్ట్‌! | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 24 2018 3:16 PM

Fake Baba Arrested In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆధ్యాత్మిక ముసుగులో ప్రజలను మోసం చేస్తున్న ఓ దొంగ బాబాను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు వివరాలను రాచకొండ జాయింట్‌ సీపీ సుధీర్‌ బాబు సోమవారం మీడియాకు తెలిపారు. గిరీష్‌ సింగ్‌ అనే వ్యక్తి బాబా అవతారమెత్తి భక్తి కార్యక్రమాల పేరిట తెలుగు రాష్ట్రాల్లోని ప్రజల నుంచి రూ.50 నుంచి రూ. 60 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. పూజలు, భక్తి ప్రవచనాల పేరుతో ప్రజలను మోసం చేసేవాడని, కొత్త కొత్త ప్రక్రియల పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ వ్యాపారం చేసాడన్నారు. 

యాప్స్ డెవలప్‌మెంట్ పేరుతో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ కూడా ఏర్పాటు చేసి ఉద్యోగాల పేరిట సుమారు 300 మంది నుంచి డబ్బు వసూలు చేసాడని తెలిపారు. బాధితులు బాబా మోసాన్ని తమ దృష్టికి తీసుకురావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని నుంచి 3 ఫోన్స్, ఒక లాప్‌టాప్‌, ఐదు భారత పాస్ పోర్టులు, ఆరు విలాస వంతమైన కార్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడు 30 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశాడని, ప్రజల సొమ్ముతో విదేశాల్లో దర్జాగా జల్సాలు చేశాడన్నారు.

Advertisement
Advertisement