ఈ బాబా కేన్సర్‌ కూడా నయం చేస్తాడు.. | fake baba arrest in hyderabad | Sakshi
Sakshi News home page

రోగం..బంగారం.. మధ్యలో దొంగబాబా

Dec 24 2017 11:04 AM | Updated on Sep 4 2018 5:32 PM

fake baba arrest in hyderabad - Sakshi

రాంగోపాల్‌పేట్‌: బంగారం, నగదు పెట్టి పూజలు చేస్తే రోగాలు మాయమవుతాయని నమ్మిస్తూ పెద్ద మొత్తంలో వాటిని కాజేసిన ఓ దొంగబాబాను వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 1.372 కేజీల బంగారం, రూ.3.5లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం సికింద్రాబాద్‌ టాస్క్‌పోర్స్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రాధాకిశన్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ గట్టు మల్లులు వివరాలు వెల్లడించారు. టోలీచౌకికి చెందిన సయ్యద్‌ ఇస్మాయిల్‌ (34) అలియాస్‌  అబ్బా జాన్‌ అక్కడే ఉంటే అటో డ్రైవర్‌గా, ఇంటీరియర్‌ డిజైనర్‌గా పనిచేసే వాడు. అందులో పెద్దగా ఆదాయం రాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని బాబా అవతారం ఎత్తాడు. 

మానసిక సమస్యలు... శారీరక రోగాలు మాయం చేస్తానని
సయ్యద్‌ ఇస్మాయిల్‌ నెల్లూరులోని బారా షాయిద్‌ దర్గా, రహ్మతాబాద్‌ దర్గాలకు వెళ్లి ఖురాన్‌లోని దుహాస్‌ అభ్యసించాడు. అక్కడ ఉండే సమయంలో కొంత మంది ఇతని దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయించుకునే వారు దీంతో వాళ్లు తమకు మేలు జరిగిందని భావించే వాళ్లు. దీన్నే ఉపాధిగా మలచుకుని అమాయకులను మోసాలు చేయాలని భావించి  హైదరాబాద్‌కు వచ్చి టోలీచౌకిలోని హెకెమ్‌పేట్‌ కుంటలో మకాం పెట్టాడు. వివిధ రోగా లతో, మానసిక జబ్బులతో బాధపడే వారికి తనకు ఉన్న  అతీత శక్తులతో మాయం చేస్తానని ప్రచారం చేసుకున్నారు. ఇలా  సంవత్సర కాలంగా ఆ ప్రాం తంలో బాగా ప్రాచుర్యం పొందాడు.

ఇలా   వచ్చిన వారిలో బాగా డబ్బున్న వారు వస్తే వారి వద్ద ఉన్న నగలు, నగదును ఒక కుండలో పెట్టి, దర్గా ఫొటోల వద్ద వాటిని ఉంచి 40 రోజులు పూజలు చేయాలని చెప్పేవాడు. దీన్ని నమ్మి వారు తమ ఇంట్లో ఉన్న బంగారాన్ని, నగదు తెచ్చి ఇతనికి ఇస్తే వారి ముందు ఒక చిన్న కుండలో పెట్టి మూతపెట్టి పూజలు చేసేవాడు. ఇలా 40 రోజులు అయిన తర్వాత కూడా తమ జబ్బు నయం కాలేదని ఎవరైనా వస్తే మరో రెండు నెలలు, మూడు నెలలు ఉంచాలని నమ్మించే వాడు. ఇలా పెద్ద మొత్తంలో నగదు, బంగారం కొల్లగొట్టాడు.

కేన్సర్‌ కూడా నయం
సయ్యద ఇస్మాయిల్‌ సాదారణ జబ్బులతో పాటు కేన్సర్‌ లాంటి ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తానని నమ్మించాడు. దీంతో 2016 ఏప్రిల్‌లో అదే ప్రాంతానికి చెందిన రజియా బేగం (67) లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ ఇతన్ని సంప్రదించింది. ఇంట్లో ఉన్న బంగారం, నగదు తెచ్చి పూజలు చేయాలని చెప్పడంతో ఆమె 14 తులాల బంగారం తెచ్చి ఇచ్చింది. రెండు నెలల తర్వాత వచ్చి చూడగా ఈ బాబా అక్కడి నుంచి మకాం మార్చేశాడు.  
అదే సంవత్సరం జూన్‌ నెలలో కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న అతీక్‌ ఉన్నిసా (40) ఇతన్ని నమ్మి 39 తులాల బంగారం ఆభరణాలు పూజ చేసేందుకు అని ఇచ్చింది. ఈ ఏడాది నవంబర్‌ నెలలో వచ్చి బాబా అక్కడ లేడని తెలుసుకుంది.  
2016 జూన్‌ నెలలో ఫాతిమ హసన్‌ అనే మహిళ మోకాళ్ల నొప్పులతో బాధపడుతూ వాటిని తగ్గించుకునేందుకు బాబాకు 40 తులాల బంగారంతో పాటు నగదును సమర్పించుకుంది. బాధితుల  ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు టోలిచౌకి ప్రాంతంలో ఉండగా శనివారం వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పట్టుకుంది. తదుపరి విచారణ కోసం నిందితున్న బంజారాహిల్స్‌ పోలీసులకు అప్పగించారు.  
మణప్పురంలో తాకట్టు
ఇలా మోసం చేసి సంపాదించిన బంగారాన్ని నిందితుడు టోలిచౌకి, చింతల్, వికారాబాద్‌లలోని మణప్పురం గోల్డ్‌లోన్‌ వద్ద తాకట్టు పెట్టి న గదును తెచ్చుకున్నాడు. పోలీసులు 1కేజీ 372 గ్రాముల బంగారాన్ని నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement