గ్యాస్ సిలిండర్ పేలి 10 మంది మృతి

Dead And Several Feared Trapped In Cylinder Blast In Uttar Pradesh - Sakshi

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మవు జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 10 దుర్మరణం పాలయ్యారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు తగిన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top