తల్లిని హతమార్చిన కుమార్తె అరెస్ట్‌

Daughter Killed Mother For Her Boyfriend in Tamil Nadu - Sakshi

చెన్నై, టీ.నగర్‌: చెన్నై, తాంబరంలో వివాహేతర సంబంధానికి అడ్డు ఉందని కన్నతల్లిని సజీవ దహనం చేసిన కుమార్తెను, అందుకు సహకరించిన ప్రియుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వివరాలు.. తాంబరం సమీపం క్రోంపేట దుర్గానగర్‌కు చెందిన సదాశివం భార్య భూపతి (60). అదే ప్రాంతంలో వీరి కుమార్తె నందిని (27) నివశిస్తోంది. ఈమె భర్త కన్నన్‌ (30) కార్మికుడు. ఇలా ఉండగా నందినికి అదే ప్రాంతానికి చెందిన మురుగన్‌ (45)తో వివాహేతర సంబంధం ఏర్పడింది.

విషయం తెలిసి భూపతి నందినిని మందలించింది. అయినప్పటికీ నందిని మురుగన్‌తోనే సంబంధం కొనసాగించినట్లు తెలిసింది. తల్లి మాటలకు విసిగిపోయిన నందిని ప్రియుడు మురుగన్‌తో కలిసి ఆమెను హతమార్చేందుకు కుట్ర పన్నింది. సంఘటన జరిగిన రోజు తల్లి ఇంటికి వచ్చిన నందిని ఆమె నిద్రిస్తుండగా ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. ఏమీ తెలియనట్లు నాటకమాడిన నందిని ఇరుగుపొరుగువారితో కలిసి తల్లిపై నీళ్లుపోసి మంటలు ఆర్పింది. సమాచారంతో పోలీసులు సంఘటన స్థలం చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ భూపతి మృతిచెందింది. పోలీసుల విచారణలో నందిని ఆమెను హతమార్చినట్లు తెలిసింది. నందినితోపాటు కుట్రకు సహకరించిన మురుగన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top