ఆపరేషన్‌ గరుడ..శివాజీపై డీజీపీకి ఫిర్యాదు

Complaint On Shivaji Regarding Murder Attempt On YS Jagan - Sakshi

హైదరాబాద్‌: సినీ నటుడు శివాజీపై తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డికి బుర్రగడ్డ అనిల్‌ కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి శివాజీని అరెస్ట్‌ చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.  ఆపరేషన్‌ గరుడలో భాగంగానే కుట్రతో ఈ దాడి జరిగిందని, సినీ నటుడు శివాజీ ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోనే శివాజీ ఉంటున్నాడు కాబట్టి తెలంగాణ పోలీసులే విచారించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీజీపీ సానుకూలంగా స్పందించారని,  ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని బుర్రగడ్డ అనిల్‌ తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top