
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చార్జ్‌షీటు దాఖలు చేసింది. గురువారం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో చార్జ్‌షీట్‌ను సమర్పించింది. షేక్‌సాబ్ అనే వ్యక్తికి సంబంధించిన మైనింగ్ స్థలాన్ని కాంట్రాక్టుకు తీసుకుని అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు చార్జ్‌షీట్‌లో సిట్ ఆరోపించింది. ఏ1గా గాలి జనార్దనరెడ్డి, ఏ2గా అలీఖాన్, ఏ3గా శ్రీనివాసరెడ్డిల పేర్లను పేర్కొంది.