షీ జాబ్స్‌.. సీత యాప్‌ | Sakshi Special Story about Swathi Nelabhatla Sitha App | Sakshi
Sakshi News home page

షీ జాబ్స్‌.. సీత యాప్‌

Jun 19 2025 12:56 AM | Updated on Jun 19 2025 12:56 AM

Sakshi Special Story about Swathi Nelabhatla Sitha App

స్త్రీ శక్తి

‘కుటుంబ వారసత్వంగా కోట్ల ఆస్తి వచ్చినా.. నీకు నువ్వు రుపాయైనా సంపాదించుకుంటేనే ఆర్థిక స్వాతంత్య్రం’ అన్న మాటను నమ్ముతారు స్వాతి నెలభట్ల! అది వాళ్ల నాన్న చెప్పిన సత్యం.. ప్రోత్సహించిన మార్గం! దాన్నే ఆశయంగా మలచుకుని ప్రయాణం సాగించిన ఆమె.. నేడు వందల మంది మహిళలకు ఉ పాధి భరోసాగా నిలిచారు! దాని పేరే ‘సీత ( SITHA).. షి ఈజ్‌ ద హీరో ఆల్వేస్‌)’ సర్వీస్‌ అండ్‌ ప్రోడక్ట్స్‌ యాప్‌! స్వాతి, ‘సీత’ వివరాలు...

స్వాతి సొంతూరు కడప. తండ్రి దుర్గాప్రసాద్‌ .. జర్నలిస్ట్‌. తల్లి సుజాత.. రిటైర్డ్‌ ఎమ్మార్వో. ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరమని చెబుతూ కూతురిలో ఆంట్రప్రెన్యూర్‌ ఆలోచనలను రేకెత్తించి, ఆ దిశగా ప్రోత్సహించారు తండ్రి. ఆమె టీనేజ్‌లోనే తండ్రి చని పోవడంతో, సింగిల్‌ పేరెంట్‌గా తల్లి సాగించిన  పోరాటమూ స్వాతికి స్ఫూర్తి అయింది. 

ఆ ఇద్దరి ప్రభావంతోనే స్వాతి ఆంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ప్రతిష్ఠాత్మక ‘అర్న్‌స్ట్‌ అండ్‌ యంగ్‌ విన్నింగ్‌ విమెన్‌ ఆంట్రప్రెన్యూర్‌’ అవార్డ్‌నూ గెలుచుకున్నారు. చెన్నైలో ఇంజినీరింగ్‌ పూర్తి చేయగానే ఉద్యోగం, పెళ్లి, బాబు.. వెంటవెంటనే జరిగి పోయాయి. బాబుకు ఆటిజం అని తేలడంతో మంచి ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా షిఫ్ట్‌ అయ్యారు.  

ప్రయత్నం.. విజయం
అక్కడికి వెళ్లాకే అసలు  పోరాటం మొదలైంది. నిలకడైన ఉద్యోగం వెదుక్కునే ప్రయత్నం, ఇంటి పని, పిల్లాడి బాధ్యత ఈ మల్టీటాస్కింగ్‌లో ఫ్లెక్సిబులిటీ ఉండేది కాదు. ఇంకోవైపు ఆంట్రప్రెన్యూర్‌ కల. అప్పుడే బలంగా అనిపించింది స్వాతికి.. తనే ఒక కంపెనీ స్టార్ట్‌ చేస్తే టైమ్‌ ఫ్లెక్సిబులిటీ దొరకడమే కాదు.. ఆశా నెరవేరుతుంది కదా అని! కసరత్తు మొదలుపెట్టింది. ఆమె శ్రమను చూసినవాళ్లంతా ‘ఎందుకీ కష్టం? హాయిగా ఇంట్లో ఉండి బాబును చూసుకోక’అంటూ సలహా ఇచ్చారు. 

ఆశయానికి తన పరిస్థితులను సాకుగా చూ పాలనుకోలేదు స్వాతి. అందుకే చిరునవ్వుతోనే వాళ్లకు బదులిచ్చి, ఐటీ కంపెనీ పెట్టారు.. పిల్లాడిని చూసుకుంటూ! ఆ కంపెనీ ఇతర ఉద్యోగులనూ  తీసుకునే స్థాయికి చేరుకోగానే మహిళలనే ముఖ్యంగా పెళ్లి, పిల్లలతో బ్రేక్‌ పడి మళ్లీ వర్క్‌ చేయాలనుకుంటున్న వాళ్లను, తనలా స్పెషల్‌ నీడ్స్‌ పిల్లలున్న తల్లులను అ పాయింట్‌ చేసుకోసాగారు. 

ఇన్నాళ్లుగా వాళ్లంతా అవకాశం కోసం వేచి ఉన్నారేమో.. జాయిన్‌ అవగానే ఫైర్‌ చూపించడం మొదలుపెట్టారు. వాళ్ల డెడికేషన్‌ చూశాక స్వాతికి అనిపించింది.. ఇలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉండొచ్చో.. రకరకాల కారణాలతో కెరీర్‌లో గ్యాప్‌ వచ్చి, మళ్లీ  వర్క్‌ చేయాలన్న పట్టుదలతో! వాళ్లందరి కోసం ఒక  ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్‌ చేయాలని! స్పెషల్‌ నీడ్స్‌ చిల్డ్రన్‌ తల్లులకూ అందులో స్పేస్‌ కల్పించాలని! అనుకున్నదే తడవుగా ‘షీ జాబ్స్‌’  పోర్టల్‌ స్టార్ట్‌ చేశారు. స్పెషల్‌ నీడ్స్‌ పిల్లల తల్లులకు పలు సంస్థల్లో ప్రత్యేకమైన కోటా కోసమూ సంస్థల సిబ్బందితో చర్చలు సాగించారు. 

అలా ముందుకు వెళ్తున్న సమయంలోనే ఆమెకు లేడీ టైలర్స్, పెయింటర్స్, కుక్స్‌ ఇలా రకరకాల పనులు చేసే మహిళల దగ్గర్నుంచి మెయిల్స్‌ రాసాగాయి.. తాము చేయదగ్గ పనులేమైనా ఉన్నాయా అంటూ! అవి ఆమెకు కొత్త ఐడియాను ఇచ్చాయి. చదువు, టెక్నాలజీకి అతీతంగా మహిళలకు ఎన్నో నైపుణ్యాలుంటాయి. వాళ్లకూ ఒక వేదిక కావాలి కదా అని! అదే ‘సీత ( ఐఖీఏఅ)’గా రూపుదిద్దుకుంది. ముగ్గులు పెట్టడం మొదలు కుట్లు అల్లికలు, మెహెందీ డిజైన్స్, వంటల నుంచి ట్యూటరింగ్, కంటెంట్‌ రైటింగ్‌ దాకా అన్ని రకాల ఉ పాధికి ఇది ప్లాట్‌ఫామ్‌ అయింది. ఇందులో సేవలే కాదు ఉత్పత్తులనూ పెట్టుకోవచ్చు అమ్మకానికి.

నాకు ఫెయిల్యూర్‌ అంటే భయం లేదు. జడ్జ్‌ చేయడాన్నీ పట్టించుకోలేదు. లక్ష్యం మీదే డిసిప్లిన్డ్‌గా ఫోకస్‌ చేశాను. మా ఫ్యామిలీ చాలా స పోర్ట్‌ చేసింది. నేను నిలదొక్కుకున్నాక నా భర్త రాజేశ్‌ ఉద్యోగం మానేసి మా బాబును చూసుకుంటున్నారు. ఒకవేళ  నాకు ఫ్యామిలీ స పోర్ట్‌ దొరక్క పోయినా నేననుకున్నది సాధించేదాన్ని. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే.. చేజ్‌ యువర్‌  ప్యాషన్‌!’
– స్వాతి నెలభట్ల 

– సరస్వతి రమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement