breaking news
sitha
-
బాధించడమే లోకం తీరు.... అందుకే శ్రీరాముడు కూడా!
లోకం నోరు చాలా పెద్దదే కాక బలమైనది కూడా. ఎంత మాట మాట్లాడటానికి కూడా వెరవదు. రాజును గురించి మాట్లాడు తున్నామా లేక ఆ రాజు దగ్గర పనిచేసే సేవకుడిని గురించి మాట్లాడుతున్నామా అన్న ఆలోచన లోకానికి ఉండదు. వాళ్ళిద్దరి మధ్య తేడా ఉన్నట్లుగా అది గుర్తించదు. లోకానికి అందరూ సమానమే! కనుక ఎవరి గురించైనా ఎంత మాటైనప్పటికీ ఏ భయమూ లేకుండా అనేసి, అక్కడితో తన పని అయిపోయినట్లుగా చేతులు దులుపుకుని నిలబడి, ఆ తరువాత ఏమి జరుగుతుందో చూస్తూ ఉంటుంది. లోకం మాటలు నచ్చనపుడు, ఆ లోకం నోరు నొక్కాలని చేసే ప్రయత్నాలు ఎవరికీ సఫలం కావు. లోకం నోరు ఎక్కడి నుండి ఎక్కడికి వ్యాపించి ఉన్నదో కనిపెట్టగలిగినవాడు ఈ లోకంలో లేడు. అది తెలిసినవాడు కనుకనే శ్రీరాముడంతటి ప్రభువు కూడా లోకం నోరు నొక్కే ప్రయత్నం చేయలేదు. సీతమ్మపై వేసిన నిందకు ఆధారం చూపమని లోకాన్ని నిలదియ్య లేదు. అది వృథా పని అని తెలిసి శ్రీరాముడు అలా చేయలేదు. దానికి బదులుగా, లోకం తన నుండి ఏమి ఆశిస్తున్నదో ఊహించి, ఆ పనిని, అది అన్యాయమని అనిపించినప్పటికీ, భరించలేని బాధకు గురిచేసినప్పటికీ, చేశాడు శ్రీరాముడు అని లక్ష్మణుడి చేత సీతమ్మకు చెప్పించాడు తిక్కన మహాకవి ‘నిర్వచనోత్తర రామాయణం’లోని ఈ కింది పద్యంలో.ఏనిం కేమని చెప్పుదున్ రఘుకులాధీశున్ జగంబెల్ల నీకై నిందింపగ జాల నొచ్చి యిది మిథ్యావాద మైనన్ సమాధానం బేర్పడ జేయకున్న నిజవృత్తం బెంతయున్ దూషితంబై నీచత్వము రాక తక్కదని యూహాపోహ సంవేదియై.‘నేనింక ఏమని చెప్పను తల్లీ! లోకమంతా నిందించడంతో కలత చెందారు శ్రీరాములవారు! అదంతా అబద్ధమనీ, అందులో ఎంతమాత్రమూ నిజం లేదన్నది తెలుస్తున్నప్పటికీ, లోకుల నిందకు సరైన సమాధానం చెప్పేదిగా అనిపించే ప్రతిక్రియను వెంటనే చేయకపోతే, అది చాలా నీచమైన పరిస్థితులకు దారి తీస్తుందని ఊహించి, లోకం తీరుకు కలత చెంది’ ఇలా చేయ మన్నారని సీతమ్మకు సంగతిని వివరించి చెప్పి, అడవిలో విడిచి వెళుతూ దుఃఖించాడు లక్ష్మణుడు.– భట్టు వెంకటరావు -
షీ జాబ్స్.. సీత యాప్
‘కుటుంబ వారసత్వంగా కోట్ల ఆస్తి వచ్చినా.. నీకు నువ్వు రుపాయైనా సంపాదించుకుంటేనే ఆర్థిక స్వాతంత్య్రం’ అన్న మాటను నమ్ముతారు స్వాతి నెలభట్ల! అది వాళ్ల నాన్న చెప్పిన సత్యం.. ప్రోత్సహించిన మార్గం! దాన్నే ఆశయంగా మలచుకుని ప్రయాణం సాగించిన ఆమె.. నేడు వందల మంది మహిళలకు ఉ పాధి భరోసాగా నిలిచారు! దాని పేరే ‘సీత ( SITHA).. షి ఈజ్ ద హీరో ఆల్వేస్)’ సర్వీస్ అండ్ ప్రోడక్ట్స్ యాప్! స్వాతి, ‘సీత’ వివరాలు...స్వాతి సొంతూరు కడప. తండ్రి దుర్గాప్రసాద్ .. జర్నలిస్ట్. తల్లి సుజాత.. రిటైర్డ్ ఎమ్మార్వో. ఆడవాళ్లకు ఆర్థిక స్వాతంత్య్రం చాలా అవసరమని చెబుతూ కూతురిలో ఆంట్రప్రెన్యూర్ ఆలోచనలను రేకెత్తించి, ఆ దిశగా ప్రోత్సహించారు తండ్రి. ఆమె టీనేజ్లోనే తండ్రి చని పోవడంతో, సింగిల్ పేరెంట్‌గా తల్లి సాగించిన పోరాటమూ స్వాతికి స్ఫూర్తి అయింది. ఆ ఇద్దరి ప్రభావంతోనే స్వాతి ఆంట్రప్రెన్యూర్‌గా ఎదిగి ప్రతిష్ఠాత్మక ‘అర్న్స్ట్ అండ్ యంగ్ విన్నింగ్ విమెన్ ఆంట్రప్రెన్యూర్’ అవార్డ్‌నూ గెలుచుకున్నారు. చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేయగానే ఉద్యోగం, పెళ్లి, బాబు.. వెంటవెంటనే జరిగి పోయాయి. బాబుకు ఆటిజం అని తేలడంతో మంచి ట్రీట్మెంట్ కోసం అమెరికా షిఫ్ట్ అయ్యారు. ప్రయత్నం.. విజయంఅక్కడికి వెళ్లాకే అసలు పోరాటం మొదలైంది. నిలకడైన ఉద్యోగం వెదుక్కునే ప్రయత్నం, ఇంటి పని, పిల్లాడి బాధ్యత ఈ మల్టీటాస్కింగ్‌లో ఫ్లెక్సిబులిటీ ఉండేది కాదు. ఇంకోవైపు ఆంట్రప్రెన్యూర్ కల. అప్పుడే బలంగా అనిపించింది స్వాతికి.. తనే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే టైమ్ ఫ్లెక్సిబులిటీ దొరకడమే కాదు.. ఆశా నెరవేరుతుంది కదా అని! కసరత్తు మొదలుపెట్టింది. ఆమె శ్రమను చూసినవాళ్లంతా ‘ఎందుకీ కష్టం? హాయిగా ఇంట్లో ఉండి బాబును చూసుకోక’అంటూ సలహా ఇచ్చారు. ఆశయానికి తన పరిస్థితులను సాకుగా చూ పాలనుకోలేదు స్వాతి. అందుకే చిరునవ్వుతోనే వాళ్లకు బదులిచ్చి, ఐటీ కంపెనీ పెట్టారు.. పిల్లాడిని చూసుకుంటూ! ఆ కంపెనీ ఇతర ఉద్యోగులనూ తీసుకునే స్థాయికి చేరుకోగానే మహిళలనే ముఖ్యంగా పెళ్లి, పిల్లలతో బ్రేక్ పడి మళ్లీ వర్క్ చేయాలనుకుంటున్న వాళ్లను, తనలా స్పెషల్ నీడ్స్ పిల్లలున్న తల్లులను అ పాయింట్ చేసుకోసాగారు. ఇన్నాళ్లుగా వాళ్లంతా అవకాశం కోసం వేచి ఉన్నారేమో.. జాయిన్ అవగానే ఫైర్ చూపించడం మొదలుపెట్టారు. వాళ్ల డెడికేషన్ చూశాక స్వాతికి అనిపించింది.. ఇలాంటి వాళ్లు ఇంకెంతమంది ఉండొచ్చో.. రకరకాల కారణాలతో కెరీర్లో గ్యాప్ వచ్చి, మళ్లీ వర్క్ చేయాలన్న పట్టుదలతో! వాళ్లందరి కోసం ఒక ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేయాలని! స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ తల్లులకూ అందులో స్పేస్ కల్పించాలని! అనుకున్నదే తడవుగా ‘షీ జాబ్స్’ పోర్టల్ స్టార్ట్ చేశారు. స్పెషల్ నీడ్స్ పిల్లల తల్లులకు పలు సంస్థల్లో ప్రత్యేకమైన కోటా కోసమూ సంస్థల సిబ్బందితో చర్చలు సాగించారు. అలా ముందుకు వెళ్తున్న సమయంలోనే ఆమెకు లేడీ టైలర్స్, పెయింటర్స్, కుక్స్ ఇలా రకరకాల పనులు చేసే మహిళల దగ్గర్నుంచి మెయిల్స్ రాసాగాయి.. తాము చేయదగ్గ పనులేమైనా ఉన్నాయా అంటూ! అవి ఆమెకు కొత్త ఐడియాను ఇచ్చాయి. చదువు, టెక్నాలజీకి అతీతంగా మహిళలకు ఎన్నో నైపుణ్యాలుంటాయి. వాళ్లకూ ఒక వేదిక కావాలి కదా అని! అదే ‘సీత ( ఐఖీఏఅ)’గా రూపుదిద్దుకుంది. ముగ్గులు పెట్టడం మొదలు కుట్లు అల్లికలు, మెహెందీ డిజైన్స్, వంటల నుంచి ట్యూటరింగ్, కంటెంట్ రైటింగ్ దాకా అన్ని రకాల ఉ పాధికి ఇది ప్లాట్‌ఫామ్ అయింది. ఇందులో సేవలే కాదు ఉత్పత్తులనూ పెట్టుకోవచ్చు అమ్మకానికి.నాకు ఫెయిల్యూర్ అంటే భయం లేదు. జడ్జ్ చేయడాన్నీ పట్టించుకోలేదు. లక్ష్యం మీదే డిసిప్లిన్డ్గా ఫోకస్ చేశాను. మా ఫ్యామిలీ చాలా స పోర్ట్ చేసింది. నేను నిలదొక్కుకున్నాక నా భర్త రాజేశ్ ఉద్యోగం మానేసి మా బాబును చూసుకుంటున్నారు. ఒకవేళ నాకు ఫ్యామిలీ స పోర్ట్ దొరక్క పోయినా నేననుకున్నది సాధించేదాన్ని. ఎవరికైనా నేను చెప్పేది ఒకటే.. చేజ్ యువర్ ప్యాషన్!’– స్వాతి నెలభట్ల – సరస్వతి రమ -
ఒక్క పాటతో మారిపోయిన కృతి సనన్ కెరీర్
-
‘సీత’ నుంచి ఫస్ట్ లుక్!
బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ కోసం ప్రయత్నిస్తూ.. వరుసగా సినిమాలను చేస్తున్నాడు. రీసెంట్గా కవచం మూవీతో పలకరించినా.. ఆశించినంత స్థాయిలో విజయం సాధించలేదు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా.. ఆయన హీరోగా నటిస్తున్న ‘సీత’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ ఫస్ట్‌లుక్‌ను బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చిన డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో ‘సీత’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా అయిన బెల్లంకొండ హీరోకు విజయాన్ని అందిస్తుందో లేదో చూడాలి. ఈ మూవీకి అనూప్‌రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు. Gear up guys.. Here it is!!! Presenting #sitafirstlook.#DirectorTeja @MsKajalAggarwal #freakycouple 😉#HappyRepublicDay2019 pic.twitter.com/CuMyCxFAu9 — Sai bellamkonda (@BSaiSreenivas) January 26, 2019 -
రెండో పెళ్లిని ఆపిన ఈ-మెయిల్
చెన్నై: విదేశాల్లో ఉన్న భార్యను మోసపుచ్చి రెండోపెళ్లికి సిద్ధమైన భర్తను ఆమె ఈ- మెయిల్ ద్వారా అడ్డుకుంది. ఈ సంఘటన తమిళనాడులోని తిరుచ్చిరాపల్లిలో చోటుచేసుకుంది. శ్రీలంకకు చెందిన శాంతివాసన్ (33) కెనడాలోని ఒక ప్రైవేటు కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తున్న శ్రీలంకకు చెందిన సీతతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వారిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో తిరుచ్చిలో ఉన్న మాజీ ప్రేయసిని పెళ్లి చేసుకుంటానని భర్త, ఎలా చేసుకుంటావో చూస్తానంటూ భార్య సవాళ్లు విసురుకున్నారు. కెనడా నుంచి ఇటీవల తిరుచ్చికి వచ్చిన శాంతివాసన్... సంఘమి(26)ని ఈనెల 4వ తేదీన రిజిష్టరు వివాహం చేసుకున్నాడు. అనంతరం ఈ నెల 9వ తేదీన సంప్రదాయ రీతిలో పెళ్లి చేసేందుకు వధువు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న కెనడాలోని శాంతివాసన్ భార్య సీత ఈ మెయిల్ ద్వారా తిరుచ్చి పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన కమిషనర్ కంటోన్మెంటు పోలీసులకు ఆదేశాలు ఇవ్వడంతో విచారణ చేపట్టారు. సీత తాను సహజీవనం చేశామని, తమకు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు శాంతివాసన్ అంగీకరించడంతో పోలీసులు పెళ్లిని ఆపేశారు.