డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన సినీ నటుడు | Cini Actor Kireeti Damaraju Caught Drunk And Driving At Jubilee Hills | Sakshi
Sakshi News home page

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో చిక్కిన సినీ నటుడు

May 13 2018 6:58 AM | Updated on Aug 21 2018 6:08 PM

సాక్షి, హైదరాబాద్‌ : డ్రంక్‌​అండ్‌ డ్రైవ్‌ చేస్తూ సినీ నటుడు కిరీటి దామరాజు పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌లో శనివారం అర్దరాత్రి పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ అతను పట్టుబడ్డారు. అర్థరాత్రి సమయంలో మద్యం సేవించి కారు నడుపుకుంటూ అటువైపుగా వచ్చిన అతను ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో తనిఖీలు చేయగా మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది. ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మొత్తం 110 మంది మందుబాబులు పట్టుబడ్డారు. కేసులు నమోదు చేసి 80 కార్లు, 30 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement