
బొమ్మనహళ్లి: సిగరెట్ ఇవ్వలేదని ఓవ్యాపారిపై దుండగుడు కత్తితో పొడిచిన సంఘటన నగరంలోని ఉత్తరహళ్లిలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడి ఆంజద్‌చాన్ ఇక్కడి విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంజద్ ఉత్తరహళ్లిలో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న బార్ వద్ద అగరబత్తిల వ్యాపారం చేస్తున్నాడు.
ఆదివారం రాత్రి 10.30 గంటల సమయంలో మద్యం మత్తులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ ఇవ్వాలని అంజాద్‌ను కోరాడు. లేదని చెప్పడంతో కత్తితో అంజద్‌ను పొడిచి పారిపోయాడు. క్షతగాత్రుడిని ఓ వ్యక్తి కారులో విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.