నేను దావూద్‌ అనుచరుడిని మాట వినకపోతే ఖతం చేస్తా..

cheating case filed on facebook fraud

బంజారాహిల్స్‌: నేను మాఫియా డాన్‌ దావూద్‌ ఇబ్రహీమ్‌ అనుచరుడినని ...తనతో సంబంధం కొనసాగింకపోతే అంతు చూస్తానని బెదిరిస్తున్న ఓ యువకుడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బెంగళూర్‌కు చెందిన యువతి(33) కమలాపురి కాలనీలో ఉంటూ సాఫ్ట్‌వేర్‌ సంస్దలో టెక్నికల్‌ రైటర్‌గా పనిచేస్తోంది. గత జూన్‌లో ఆమెకు ఫేస్‌బుక్‌ ద్వారా డీజే. అడ్డి దుబాయ్‌ అలియస్‌ ఎండీ సఫీ –ఉర్‌– రెహమాన్‌ అలియాస్‌ సఫీతో పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు లేరని దుబాయ్‌ పౌరసత్వం ఉందని, గత 8 ఏళ్లుగా అక్కడే డీజేగా పనిచేస్తున్నానని ఒక కేఫ్‌తో పాటు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నట్లు నమ్మించాడు. గత జులైలో ఇద్దరూ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో సహజీవనం చేశారు.

అతడికి అప్పటికే వివాహం జరిగిందని, ఒక కుమార్తె కూడా ఉందని, తల్లిదండ్రులతో కలిసి అత్తాపూర్‌ హుస్సేన్‌కాజిల్లో ఉంటున్నట్లు తెలుసుకున్న ఆమె ఈ నెల 2న అడ్డీని నిలదీయగా ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. దీంతో అతను తన లాప్‌ట్యాప్‌తో పాటు ఫోన్, నగలు, నగదు తీసుకుని పరారయ్యాడని ఈ విషయం పోలీసులకు చెబితే తనతో దిగిన ఫోటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనితో విడిపోవాలని తాను నిర్ణయించుకున్నా తాను పిలిచినప్పుడల్లా వచ్చి కోరికలు తీర్చాల్సిందిగా బెదిరిస్తున్నాడని ఆరోపించింది. తనకు సహకరించకపోతే దావూద్‌ ఇబ్రహీంతో చెప్పి అడ్రస్‌ లేకుండా చేయిస్తానని హెచ్చరిస్తున్నాడని తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు అడ్డి దుబాయ్‌పై పోలీసులు ఐపీసీ  కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు, ఎస్‌ఐ వినోద్‌కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top