రిటైర్డ్‌ ఎస్‌ఐ భార్య మెడలో చైన్‌స్నాచింగ్‌ | Chain Snaching Incident At Indrakeeladri In Vijayawada | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ ఎస్‌ఐ భార్య మెడలో చైన్‌స్నాచింగ్‌

Jul 25 2018 1:44 PM | Updated on Jul 25 2018 1:44 PM

Chain Snaching Incident At Indrakeeladri In Vijayawada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ భార్య మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కొని పారిపోయారు.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఓం టర్నింగ్‌ వద్ద చైన్‌ స్నాచింగ్‌ ఘటన బుధవారం చోటుచేసుకుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఓ రిటైర్డ్‌ ఎస్‌ఐ భార్య మెడలోని బంగారు గొలుసును దొంగలు లాక్కొని పారిపోయారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శాకాంబరీ దేవీ ఉత్సవాలు జరుగుతుండటంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు.

ఇదే అదనుగా భావించి దొంగలు వృద్ధులను టార్గెట్‌గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసు సిబ్బంది ఉత్సవాల బందోబస్తులో ఉండగానే దొంగల చేతివాటం బయటపడింది. ఈ ఘటనతో మరోసారి సీసీటీవీ డొల్లతనం బయటపడింది. చైన్‌స్నాచర్ల భయంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement