గేదెల రుణం : బ్యాంకు సీనియర్‌ అధికారి అరెస్ట్‌

CBI arrests PNB manager for taking Rs 1 lakh bribe to disburse loan - Sakshi

సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. గేదెలను కొనుగోలు చేయడానికి రుణం మంజూరు చేసినందుకు గాను లక్ష రూపాయల లంచం లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో వలపన్నిన  సీబీఐ అధికారులు  పీఎన్‌బీ సీనియర్ మేనేజర్ సుమేర్ సింగ్, అతని సతీష్‌ సహచరుడిని  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హర్యానా, రేవారి జిల్లా కన్వాలి బ్రాంచ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 

సీబీఐ ప్రతినిధి ఆర్కె గౌర్ అందించిన సమాచారం కుష్పురాలో డెయిరీ యూనిట్ నడుపుతున్న ఫిర్యాదుదారునికి రూ .24.72 లక్షల రుణం మంజూరుకు పశుసంవర్ధక శాఖ ఆమోదించింది. గేదెలను కొనుగోలు చేసేందుకు మొదటి దశగా రూ.7.92 లక్షలను బ్యాంకు మంజూరు చేయాల్సి వుంది. అయితే ఇందుకుగాను లక్ష రూపాయల లంచం డిమాండ్ చేశాడు సుమేర్‌ సింగ్‌. ఈ మొత్తాన్ని మధ్యవర్తి (ప్రైవేట్ వ్యక్తి) కు అప్పగించాలని నిందితులు ఫిర్యాదుదారుని కోరారు.  దీంతో అతడు సీబీఐని ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో లంచం తీసుకుంటుండగా నిందితులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top