ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు | Case Filed Against Goshamahal MLA Raja Singh For Hurting Religious Sentiments | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు

Jun 12 2018 12:05 PM | Updated on Mar 28 2019 8:41 PM

Case Filed Against Goshamahal MLA Raja Singh For Hurting Religious Sentiments - Sakshi

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (పాత ఫొటో)

సాక్షి, హైదరాబాద్‌ :  గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్‌(బీజేపీ) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రంజాన్‌ పవిత్ర మాసం సందర్భంగా పలు రాజకీయ పార్టీలు, నాయకులు ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ సోషల్‌ మీడియాలో వీడియో పోస్ట్‌ చేశారు. కేవలం ఓట్లు అడుక్కోవడానికే రాజకీయ నాయకులు ఇలాంటి విందులు ఏర్పాటు చేస్తారని... అలాంటి వాటికి తానెప్పుడూ దూరంగా ఉంటానని రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రస్తుతం ఇఫ్తార్‌ విందులు ఏర్పాటు చేయడంలో మునిగిపోయిందని.. మిగతా వారి గురించి పట్టించుకునే తీరిక వారికి లేదని విమర్శించారు. అంతేకాకుండా దేశంలో జరుగుతున్న ఉగ్రవాద దాడులకు ‘గ్రీన్‌బుక్‌’  కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా మతపరమైన భావనలను కించపరిచారనే కారణంగా సెక్షన్‌ 153-ఎ కింద రాజా సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు ఫలక్‌నామా పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement