తల్లిదండ్రులు మందలించారని బాలుడు అదృశ్యం | The boy's disappearance | Sakshi
Sakshi News home page

తల్లిదండ్రులు మందలించారని బాలుడు అదృశ్యం

Apr 7 2018 1:15 PM | Updated on Jul 12 2019 3:29 PM

The boy's disappearance - Sakshi

మధుకుమార్‌ (ఫైల్‌)   

మైలార్‌దేవ్‌పల్లి: బుద్దిగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయాడు. ఈ సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన మహేష్‌కుమార్‌ కొడుకు ఎం.మధుకుమార్‌ (12) స్థానికంగా ఉన్న సెయింట్‌ మేరీస్‌ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు.

పరీక్షలు సమీపిస్తుండటంతో మధుకుమార్‌ చదువును నిర్లక్ష్యం చేస్తూ ఆటపాటలతో సమయం వృథా చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పరీక్షలకు మంచిగా చదువుకోవాలని మందలించడంతో ఈ నెల 3న రాత్రి 10 గంటలకు ఇంటి నుంచి పారిపోయాడు.

విషయం గ్రహించిన తల్లిదండ్రులు బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసిన ఆచూకీ తెలియకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement