పిల్లలిద్దరినీ ఓవెన్‌లో కుక్కి... | Atlanta Mother Kills Two Sons | Sakshi
Sakshi News home page

మానసిక వ్యాధితో పిల్లల్ని చంపిన తల్లి

Oct 20 2017 10:25 AM | Updated on Oct 20 2017 10:25 AM

Atlanta Mother Kills Two Sons

సాక్షి, న్యూయార్క్‌ : అమెరికాలో గత వారం ఓ తల్లి అత్యంత క్రూరమైన ఘటనకు పాల్పడింది. తన ఇద్దరు పిల్లను ఓవెన్‌లో పెట్టి హింసించి మరీ చంపింది. ఆ తల్లి అంతటితో ఆగలేదు. ఆ తతంగం అంతా వీడియో తీసి తన భర్తకు పంపింది. అయితే అతను అప్రమత్తం అయ్యే లోపే ఘోరం జరిగిపోయింది. 

అట్లాంటాకు చెందిన లమోరా విలియమ్స్ భర్తతో వీడియో ఛాట్ చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఆ మహిళ.. తన రెండేళ్ల కుమారుడు యుంటే పెన్, ఏడాది చిన్నారి కార్టర్ విలియమ్స్‌లను ఒవెన్‌లో కూర్చోపెట్టింది. అయితే తన పిల్లలను ఏదో ప్రమాదం జరగబోతుందని ఊహించిన తండ్రి జమీల్‌ పెన్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.   

అధికారులు అక్కడికి వచ్చే లోపే పిల్లలు మాంసం ముద్దలుగా మారిపోయారు. కాగా, ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు ఇరుగుపొరుగు వారు తెలిపారు. అయినప్పటికీ లమోరాపై హత్యా నేరం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement