పెళ్లి చేసుకుంటానని నమ్మించి..

సాక్షి, విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఓ ఆర్మీ ఉద్యోగి గర్భవతిని చేసిన సంఘటన స్ధానికంగా కలకలం రేపింది. ఈ ఘటన విశాఖపట్నంలోని చోడవరం మండలం గౌరవరం గ్రామంలో చోటుచేసుకుంది. జొన్నపల్లి జగన్నాథం అనే ఆర్మీ ఉద్యోగి ఓ మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు చోడవరం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆర్మీ ఉద్యోగిపై నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి