‘దిశ’పై పోస్టులు.. మరొకరి అరెస్టు  | Another Person Arrested By Explicit Posts In Facebook Of Disha | Sakshi
Sakshi News home page

‘దిశ’పై పోస్టులు.. మరొకరి అరెస్టు 

Dec 5 2019 4:16 AM | Updated on Dec 5 2019 4:18 AM

Another Person Arrested By Explicit Posts In Facebook Of Disha - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఫేస్‌బుక్‌ వేదికగా ‘దిశ’పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో కీలక నిందితుడు సాయినాథ్‌ను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శనివారం నమోదు చేసిన కేసులో ఇతడే కీలకమని, మంగళవారం చిక్కిన శ్రీరామ్‌ సహ నిందితుడని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఉన్న అమరావతి కొండయ్య కాలనీకి చెందిన సాయినాథ్‌ అలియాస్‌ నాని బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నాడు.

ఇటీవల జరిగిన దిశ ఉదంతం నేపథ్యంలో ఆమెను ఉద్దేశించి తన వాల్‌పై నాని అనుచిత వ్యాఖ్యలు పోస్ట్‌ చేశాడు. వీటిని సమర్థిస్తూ శ్రీరామ్‌ సహా మరికొందరు కామెంట్స్‌ పెట్టారు. వీటిపై స్పందించిన సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఈ వ్యవహారంపై శనివారం సుమోటోగా కేసు నమోదు చేశారు. ఆధారాలను బట్టి సాయినాథ్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తిం చారు. బుధవారం గుంటూరు వెళ్లిన ఓ ప్రత్యేక బృందం అతడిని అరెస్టు చేసింది. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement