లైంగికదాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

లైంగికదాడికి పాల్పడిన నిందితుడి అరెస్ట్‌

Published Sat, Aug 25 2018 3:00 PM

Accused Arrested  - Sakshi

చౌటుప్పల్‌(మునుగోడు) : బ్లాక్‌మెయిల్‌ చేసి వివా హితపై మూడేళ్లు లైంగికదాడికి పాల్పడిన నింది తుడిని శుక్రవారం చౌటుప్పల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇందుకు సహకరించిన ఇద్దరి యువకులను కూడా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపారు. ఈ వివరాలను పోలీస్‌స్టేషన్‌లో ఏసీపీ రామోజు రమేష్‌ విలేకరులకు వివరించారు. చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన ఉప్పుతోట రంగయ్య బండలు తొలగించే కంప్రెషర్‌ పనిచేస్తుంటాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు సైతం ఉన్నారు. వివాహం జరి గిన కూమార్తె కూడా ఉంది. గ్రామంలోని ఓ 35 ఏళ్ల వయస్సు కల్గిన మహిళపై కన్నేశాడు.

ఎలాగైనా ఆమెను అనుభవించాలని అనుకున్నాడు. కుదరని పక్షంలో రహస్యంగా తను స్నానం చేస్తుండగా తీసిన వీడియోలను చూపించి లొంగదీసుకున్నాడు. అలా మూడేళ్లుగా వ్యవహారం నడిపిం చా డు. శృంగార సమయంలోనూ వీడియోలు తీశా డు. ఇటీవల కొంతకాలంగా సదరు మహిళ రంగయ్యను దగ్గరకు రానివ్వకుండా దూరంపెట్టింది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన రంగయ్య తనలోని శాడిజాన్ని బయటకు లాగాడు.

శృంగార వీడియోలను వాట్సప్‌ గ్రూప్‌లో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అప్‌లోడ్‌ చేసే పరిజ్ఞానం తన వద్ద లేకపోవడంతో తమ గ్రామానికే చెందిన యువకుల సహాయం తీసుకున్నాడు. చౌటుప్పల్‌లో ఫొటోస్టూడియో నడుపుకుంటున్న  గ్రామానికి చెందిన వరికుప్పల మహేష్, అదేగ్రామానికి చెం దిన నల్లెంకి ప్రశాంత్‌లను సంప్రదించాడు. వారు వీడియోలను తన కంప్యూటర్‌లోకి వేసుకున్నారు. అందులో ఉన్న వీడియోలను ముగ్గురూ కలిసి ఈ నెల 14న గ్రామానికి చెందిన వాట్సప్‌ గ్రూప్‌లు, వ్యక్తిగత వాట్సప్‌లకు, ఫేస్‌బుక్‌లకు పంపిం చా రు.

గ్రామంలో శృంగార వీడియోలు వైరల్‌గా మా రాయి. ఇంతలోనే విషయాన్ని తెలుసుకున్న బాధి త మహిళ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. జరిగిన విషయం చెప్పింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వీడియోలను తొలగించారు. నిందితుడు రంగయ్య, సహకరించిన మహేష్, ప్రశాంత్‌లను అరెస్టు చేసి రిమాండ్‌ నిమిత్తం రామన్నపేట కోర్టుకు తరలించారు. వారి నుంచి ద్విచక్రవాహనం, మూడు సెల్‌ఫోన్లు, కంప్యూటర్, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సీఐ ఏరుకొండ వెంకటయ్య, ఎస్‌ఐ చిల్లా సాయిలు, సిబ్బం ది నర్సింహ, ఊడుగు సైదులు ఉన్నారు.

గతంలో మావోయిస్టు సానుభూతిపరుడిగా..

నిందితుడు ఉప్పుతోట రంగయ్య గతంలో మా వోయిస్టు సానుభూతిపరుడు. దీంతో ఇతని వ్యవహారాల్లో గ్రామస్తులు పెద్దగా జోక్యం చేసుకునేవారు కాదని స్థానికులు తెలుపుతున్నారు.

Advertisement
Advertisement