సై అంటున్న చైనా యాపిల్ | Xiaomi to release new phone, mi max soon | Sakshi
Sakshi News home page

సై అంటున్న చైనా యాపిల్

May 10 2016 5:51 PM | Updated on Sep 3 2017 11:48 PM

సై అంటున్న చైనా యాపిల్

సై అంటున్న చైనా యాపిల్

చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కార్పొరేషన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు సై అంటోంది.

చైనా యాపిల్‌గా పేరొందిన షియోమి కార్పొరేషన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసి స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు సై అంటోంది. ఎంఐ మాక్స్ పేరుతో ఏకంగా 6.44 అంగుళాల భారీ స్క్రీన్ ఉన్న ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇది 7.5 మిల్లీమీటర్ల మందం ఉంటుంది. ఇందులో అధిక సామర్థ్యం కలిగిన 4850 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. దీనివల్ల ఫోన్ బ్యాటరీ బ్యాకప్ త్వరగా అయిపోతుందన్న భయం అక్కర్లేదు. ఈ కొత్త ఫోన్ మూడు వేరియంట్లలో లభిస్తోంది. అవి 32 జీబీ, 64 జీబీ, 128 జీబి. బేస్‌ మోడల్ ఒక్కదాంట్లో స్నాప్‌డ్రాగన్ 650 చిప్‌సెట్ ఉండగా, మిగిలిన రెండింటిలో స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్ ఉంటుంది. 128 జీబీ మోడల్లో 4 జీబీ ర్యామ్ ఉండగా మిగిలిన రెండింటికీ 3జీబీ ర్యామ్ ఉంటుంది.

దీని స్క్రీన్ సైజు, ఇతర పారామీటర్లకు అనుగుణంగానే ధర కూడా కొంచెం ఎక్కువగానే ఉంది. 32 జీబీ మోడల్ రూ. 15350, 64 జీబీ మోడల్ అయితే రూ. 17,400, 128 జీబీ మోడల్ అయితే రూ. 20,450 చొప్పున ధర నిర్ణయించారు. వీటన్నింటిలోనూ 16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. వీటితోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్, 4జి డ్యూయల్ సిమ్, 4850 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా మూడు వేరియంట్లలోను ఉన్నాయి. తెలుపు, బంగారు, ఊదా రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతుంది. ఇందులో ఎంఐయుఐ వెర్షన్ 8 ఉండటంతో.. కొత్త డిజైన్ ఉంటుందని, దాంతోపాటు గ్యాలరీ, నోట్స్, కాలిక్యులేటర్, స్కానర్ లాంటి అన్నీ అప్ డేట్ అయ్యాయని అంఉటన్నారు. అయితే ఇది మార్కెట్లలోకి ఎప్పుడు విడుదల అవుతుందో మాత్రం ఇంకా తెలియలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement