
ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌గా వాట్సాప్ ఎంతో ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే. ఈ మధ్యన ఈ యాప్ కొన్ని ఫోన్లకు పనిచేయకుండా పోతోంది. బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత వాటికి వాట్సాప్ పనిచేయడం గతేడాది చివరి నుంచి ఆగిపోయింది. నోకియా ఎస్40 డివైజ్‌లకు కూడా ఈ ఏడాది చివరి వరకు ఆగిపోనుంది. తాజాగా మరికొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లకు కూడా వాట్సాప్ పనిచేయదట.
ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్లకు కూడా 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ ఆగిపోనుందని తెలుస్తోంది. ఈ జింజర్‌బ్రెడ్ లేదా వెర్షన్ 2.ఎక్స్.ఎక్స్ యూజర్లకు తొలుత 2010లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెర్షన్ వాడే వారు 3.9 మిలియన్ మంది యూజర్లున్నారు. అంటే మొత్తం ఆండ్రాయిడ్ యూజర్లలో 0.3 శాతం మంది. అదనంగా ఐఓఎస్7 డివైజ్‌లకు కూడా ఇదే తేదీ నుంచి వాట్సాప్ సపోర్టు చేయదని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లు 2020 ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ సపోర్టును కోల్పోనున్నారని రిపోర్టులు తెలిపాయి. ఈ వెర్షన్ ఉన్న వారు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ప్రస్తుత వెర్షన్‌లోకి అప్‌గ్రేడ్ అవ్వాలని సూచించాయి. వాట్సాప్ ఇటీవలే తన యూజర్లకు కొత్త కొత్త ఫీచర్లను ఆఫర్ చేయడం ప్రారంభించింది. తన సబ్‌స్క్రైబర్లను పెంచుకుంటూ.. వారికి వినూత్నమైన ఆఫర్లను అందించాలని వాట్సాప్ ఈ ఫీచర్లను తీసుకొస్తోంది. గ్రూప్ వీడియో, వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఇటీవలే వాట్సాప్ తన ఎంపిక చేసిన యూజర్లకు లాంచ్ చేసింది. వాట్సాప్ గ్రూప్ వీడియో కాలింగ్ అచ్చం ఫేస్‌బుక్ గ్రూప్ వీడియో కాలింగ్ ఫీచర్‌ను పోలి ఉండటం గమనార్హం.