వాట్సాప్‌లో ఆ ఫీచర్‌ కూడా వచ్చేసింది

WhatsApp Officially Rolls Out Forward Message Limit for Indian Users - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. నకిలీ, రెచ్చగొట్టే తప్పుడు వార్తలు బాగా షేర్‌ అవుతున్న వైనంపై భారత ప్రభుత్వం  సీరియస్‌గా స్పందించిన నేపథ్యంలో  ఫార్వర్డ్‌ మెసేజ్‌లను నియంత్రించేందుకు చర్యలు చేపట్టింది. మెసేజ్‌లు, ఇమేజ్‌లు, వీడియోలు ఒకేసారి పెద్ద సంఖ్యలో షేర్‌ చేయకుండా ఐదుగురికి మాత్రమే వాటిని పంపేలా ‘వాట్సాప్‌’ నియంత్రణ చర్యలు చేపట్టింది. భారతదేశంలో 200 మిలియన్లకు పైగా యూజర్లను కలిగివున్న వాట్సాప్‌  సందేశాల షేరింగ్‌పై ఈ ఆంక్షలు విధించింది. వాట్సాప్‌ ప్రస్తుత వెర్షన్‌లో కేవలం  ఐదుగురికి మాత్రమే ఒక మేసేజ్‌ను ఫార్వార్డ్‌ చేసే అవకాశం ఉంది. ఈ వారం నుంచే  ఈ నిబంధన అమల్లోకి వస్తుందని బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ మేరకు వినియోగదారుల అవగాహన కోసం ఒక వీడియోను  కూడా విడుదల  చేసింది.

వాట్సాప్‌లో ఇప్పటికే ఈ నిబంధన  వాట్సాప్‌లో  షేరింగ్‌ ప్రక్రియలో అమల్లోకి వచ్చిన తీరును మనం గమనించ వచ్చు. ఒక మెసేజ్‌ను ఐదుగురికి మించి షేర్‌ చేసేందుకు  ప్రయత్నిస్తే.. వెంటనే ఒక వార్నింగ్‌ మెసేజ్‌ డిస్‌ప్లే అవుతుంది.

మరోవైపు  గత నెలలో ఫేస్‌బుక్‌ సొంతమైన  ఫ్లాట్‌ఫాం వాట్సాప్‌లో ఐదు చాట్లకు సందేశాన్ని ఫార్వర్డ్ చేయడానికి కట్టడి చేసేలా  టెస్టింగ్‌  ఫీచర్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. భారత ప్రభుత్వ ఒత్తిడితో  వాట్సాప్‌ సందేశాలను, చిత్రాలు, వీడియోల సామూహిక ఫార్వార్డింగ్‌ను తగ్గించేందుకు ఈ నియంత్రణ  విధిస్తున్నట్టు పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే మాములుగా వచ్చిన మెస్సేజ్ లకు, ఫార్వార్డ్ ద్వారా వచ్చిన మెస్సేజ్‌లకు మధ్య డిఫరెన్స్ ను స్పష్టంగా చూపించేలా  ‘ఫార్వార్డెడ్‌’ అని సింబల్ రూపంలో చూపిస్తూ వుండటం మనకు తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top