వాట్సాప్‌లో ఆ ఎమోజీ...నోటీసులు

WhatsApp gets legal notice from Delhi lawyer to remove middle finger emoji - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  ​ ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌మరోసారి చిక్కుల్లో పడింది. ముఖ్యంగా ఎమోజీల్లో అసభ్యకరమైన  చిహ్నం ఉందంటూ ఢిల్లీ న్యాయవాది ఒకరు వాట్సాప్‌కు నోటీసులు పంపారు.

ఢిల్లీ న్యాయవాది గుర్మీత్ సింగ్  వాట్సాప్‌కు తాజా నోటీసులు పంపారు. దీనిపై 1 5రోజులలోపు  అభ్యంతరకరంగా ఉన్న మిడిల్‌  ఫింగర్‌  చిహ్నాన్ని  తొలగించాలని డిమాండ్‌ చేశారు.  ఇది   అశ్లీలమైనదిగాను,  హానికరంగాను ఉందని గుర్మీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.  ఇది చట్టవిరుద్ధమైనదని కూడా ఆయన వాదిస్తున్నారు. భారతీయ శిక్షా స్మృతిలోని 354 ,509  సెక్షన్ల ప్రకారం, ఎవరైనా అశ్లీలమైన, అప్రియమైన, అశ్లీల సంజ్ఞల వాడకం చట్టవిరుద్ధమన్నారు.
 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top