బుజ్జిగా, ముద్దుగా ఉండే ఆ కారు ఇక కనిపించదట!!

Volkswagen To End Production Of The Beetle Next Year - Sakshi

బీటిల్‌ కారు గుర్తుందా... కేవలం రెండే రెండు డోర్లతో, చూడటానికి బుజ్జిగా ముద్దుగా ఉంటూ సినిమాల్లోనూ, రోడ్లపై ఆసక్తికరంగా కనిపించేది. ఈ కారు ఇక నుంచి కాల గర్భంలో కలిసిపోనుందట. ఈ కార్లను తయారు చేసే ప్రముఖ అంతర్జాతీయ ఆటోమోటివ్‌ దిగ్గజ సంస్థ ఫోక్స్‌వాగన్‌, బీటిల్‌ కాంపాక్ట్‌ కారును 2019 నుంచి ఉత్పత్తి చేయడం ఆపివేయాలని నిర్ణయించింది. 2019లో బీటిల్‌ కాంపాక్ట్‌ కారు ఉత్పత్తిని ఆపివేస్తున్నామంటూ గురువారం ఫోక్స్‌వాగన్‌ ప్రకటించింది. 1930లో ఫోక్స్‌వాగన్‌ బీటిల్‌ రోడ్లపైకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం జర్మన్ల పునర్‌జన్మకు ఇది సింబల్‌గా నిలుస్తూ వచ్చింది. 

1979లో ఓ బగ్‌ కారణంతో అమెరికాలో విక్రయాలను ఫోక్స్‌వాగన్‌ నిలిపివేసింది. కానీ మెక్సికో, లాటిన్‌ అమెరికాలో ఉత్పత్తిని కొనసాగిస్తూ వచ్చింది. 1990 మధ్య కాలంలో, ఫోక్స్‌వాగన్‌ అమెరికాలో విక్రయాలను పునర్‌నిర్మించుకోవాలని కష్టపడుతున్న సమయంలో, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఫెర్డినాండ్‌ పైచ్‌ తన తాత ఫెర్డినాండ్‌ పోర్స్చే చేత  బీటిల్‌ డిజైన్‌ను పునరుద్ధరించడం, ఆధునీకరించడం చేశారు. దీనికి ఫలితంగా 1998లో చంద్రవంక ఆకారంలో ‘కొత్త బీటిల్‌’ కారు రూపుదిద్దుకుంది.

1999లో 80వేలకు పైగా కార్లను విక్రయించింది. కానీ ఇటీవల అమెరికాలో దీని విక్రయాలు పడిపోయాయి. చాలా వరకు చిన్న కార్ల విక్రయాలు తగ్గిపోయాయి. దీంతో మొత్తంగా 1998 నుంచి గ్లోబల్‌గా 5 లక్షల బీటిల్‌ కార్లనే విక్రయించింది ఫోక్స్‌వాగన్‌. 2018లో తొలి ఎనిమిది నెలల కాలంలో ఫోక్స్‌వాగన్‌ కేవలం 11,151 బీటిల్స్‌నే అమ్మింది. అంటే అంతకముందటి సంవత్సరం కంటే 2.2 శాతం తక్కువ. అమెరికా వినియోగదారులు ప్రస్తుతం బీటిల్‌ కారును పక్కన పెట్టి, జెట్టా సెడాన్‌, టిగువన్‌ స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాన్ని కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు. దీంతో పాటు గత మూడేళ్లుగా కూడా ఫోక్స్‌వాగన్‌, కర్బన్‌ ఉద్గారాల స్కాం విషయంలో అతలాకుతలమవుతోంది. బీటిల్‌ విక్రయాలు మందగించడం, ఎలక్ట్రిక్‌ వాహనాలపై వినియోగదారులు ఎక్కువగా దృష్టిసారించడం ఆ కంపెనీకి దెబ్బకొడుతోంది. దీంతో బీటిల్‌ ఉత్పత్తిని నిలిపివేసి, ఎలక్ట్రిక్‌ కార్లను విక్రయించాలని ఫోక్స్‌వాగన్‌ ప్లాన్‌ చేసింది. తన ఫైనల్‌ లెనప్‌లో రెండు స్పెషల్‌ బీటల్‌ మోడల్స్‌ను విడుదల చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఫైనల్‌ ఎడిషన్‌ ఎస్‌ఈ, ఫైనల్‌ ఎడిషన్‌ ఎస్‌ఈఎల్‌లను, డ్రైవర్‌ అసిస్టెన్స్‌ టెక్నాలజీతో ప్రవేశపెట్టిన అనంతరం, బీటిల్‌ ఉత్పత్తికి గుడ్‌బై చెప్పనుంది ఫోక్స్‌వాగన్‌. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top