టాటా మోటార్స్‌ వాహన ధరల పెంపు 

Tata Motors hikes vehicle prices - Sakshi

ఆగస్టు నుంచి 2.2% వరకు అప్‌  

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తన వాహనాల తాలూకు అన్ని మోడళ్ల ధరలనూ వచ్చేనెల నుంచి పెంచుతోంది. ఈ పెంపు 2 నుంచి 2.2 శాతం మధ్య ఉంటుందని టాటా మోటార్స్‌ ప్యాసింజర్‌ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్‌ మయాంక్‌ పారీఖ్‌ వెల్లడించారు. వ్యయ నియంత్రణపై కసరత్తు చేస్తున్నప్పటికీ ముడి పదార్ధాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదన్నారు.

రూ.2.36 లక్షల నానో నుంచి రూ.17.89 లక్షల ఎస్‌యూవీ హెక్సా వరకు వివిధ సెగ్మెంట్లలో టాటా మోటార్స్‌ కార్లను విక్రయిస్తోంది. గడిచిన 28 నెలలుగా తాము ఇండస్ట్రీని మించి వృద్ధి సాధించామని చెప్పారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top