ఆ విద్యార్థులకు 2 నెలలకి రూ.5 లక్షల వేతనం | Student Of This B-School Bags Summer Internship Stipend Of Rs. 5 Lakh | Sakshi
Sakshi News home page

ఆ విద్యార్థులకు 2 నెలలకి రూ.5 లక్షల వేతనం

Dec 9 2017 9:42 AM | Updated on Dec 9 2017 10:28 AM

Student Of This B-School Bags Summer Internship Stipend Of Rs. 5 Lakh - Sakshi

కోల్‌కత్తా : జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, జంషెడ్‌పూర్‌ విద్యార్థులు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ ప్రొగ్రామ్‌ కింద భారీ ఎత్తున్న వేతనం పొందుతున్నారు. ఈ బీ-స్కూల్‌ కేవలం రెండు రోజుల్లో పూర్తిచేసిన ఈ ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాసెస్‌లో, టాప్‌ కంపెనీలు పాల్గొన్నాయి. ప్రైస్‌వాటర్‌హౌజ్‌కాపర్స్‌, కోకాకోలా, మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలు విద్యార్థులను తమ ఇంటర్న్‌లుగా తీసుకున్నాయి. ఇంటర్న్‌లుగా నియమించుకున్న వీరికి అ‍త్యధిక వేతనం కింద రూ.5 లక్షల వరకు చెల్లిస్తున్నట్టు తెలిసింది. ''2017-19 బ్యాచ్‌కు చెందిన 364 మంది విద్యార్థులు 100 శాతం ప్లేస్‌మెంట్‌ పొందారు. వీరికి సగటు వేతనం 20 శాతం పైగా పెరిగి, రెండు నెలలకు గాను రూ.5 లక్షలను టచ్‌ చేసింది'' అని జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

90కి పైగా కంపెనీలు ఈ ఇంటర్న్‌షిప్‌ ప్లేస్‌మెంట్‌లో పాల్గొన్నాయి. కన్సల్టింగ్‌, ఫైనాన్స్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌, ఆపరేషన్స్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌, హ్యుమన్‌ రిసోర్స్‌, ఇండస్ట్రీయల్‌ రిలేషన్స్‌ వంటి పొజిషన్లను కంపెనీలు విద్యార్థులకు ఆఫర్‌ చేశాయి. పలు కొత్త కంపెనీలు కూడా ఈ రిక్రూటర్స్‌ జాబితాలో ఉన్నాయి. జేవియర్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రొగ్రామ్‌లో టాప్‌ రిక్రూటర్లుగా బీసీజీ, పీడబ్ల్యూసీ, కోకా-కోలా, హెచ్‌సీసీబీ, హెచ్‌యూఎల్‌, ఐటీసీ, పీ అండ్‌ జీ, టీఏఎస్‌, ఆర్‌బీ, మైక్రోసాఫ్ట్‌, ఉబర్‌, ఏబీజీ వంటి పలు సంస్థలున్నాయి. రంగాల పరంగా ఎఫ్‌ఎంసీజీ 27 శాతం షేరుతో టాప్‌లో ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement