10800కి ఎగువన ముగిస్తేనే...

Stockmarkets Trading With Flat Note - Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నష్టాల్లో మొదలైన సూచీలు, ఆ తర్వాత పుంజుకున్నా మళ్లీ నెగిటివ్‌ జోన్‌లోకి  మారి ఊగిసలాడుతున్నాయి. వారాంతంలో షార్ట్ కవరింగ్స్ కారణంగా మార్కెట్లో లాభాలు కనిపిస్తున్నాయని ఎనలిస్టులు తెలిపారు. బ్యాంకింగ్ స్టాక్స్‌లో అమ్మకాల ధోరణి నెలకొంది. ప్రస్తుతం సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 35861 వద్ద,  5 పాయింట్లు నష్టంతో నిఫ్టీ 10785 వద్ద ట్రేడవుతోంది. అయితే 10800 స్థాయి వద్ద నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందని, దీన్ని అధిగమించి నిలబడితేనే, మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ నెలకొంటుందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు    భావిస్తున్నారు.  లేదంటే మరింత బలహీనత  తప‍్పదని , ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top