Sakshi News home page

నష్టాల ముగింపు: ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ డీలా

Published Thu, Mar 15 2018 3:49 PM

Stockmarkets ended in red - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి బలహీనంగానే ఉన్నప్పటికీ మిడ్‌ సెషన్‌ నుంచీ పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు  మరింత డీలాపడ్డాయి. చివరికి వరుసగా మూడో రోజూకూడా నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 33,685 వద్ద,  నిఫ్టీ 51పాయింట్ల నష్టంతో 10,360 వద్ద ముగిసింది.  దాదాపు  అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సెక్టార్‌  భారీగా నష్టపోయింది.

ఐవోసీ, ఎస్‌బ్యాంక్‌, రిలయన్స్‌, గెయిల్‌, ఐసీఐసీఐబ్యాంక్‌ టాప్‌లూజర్స్‌ గా  నిలిచాయి. టాటా స్టీల్‌,అల్ట్రాటెక్‌, సిప్లా, వేదాంతా, హిందాల్కో, గెయిల్‌  నష్టపోగా  ఏషియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐబీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం, అదానీ పోర్ట్స్‌, ఇండస్‌ఇండ్‌  లాభపడ్డాయి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement