వి.ఆర్.కె సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీయ | Shriya Saran as brand ambassador for VRK Silks | Sakshi
Sakshi News home page

వి.ఆర్.కె సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీయ

Jan 26 2016 2:22 AM | Updated on Sep 3 2017 4:18 PM

వి.ఆర్.కె సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీయ

వి.ఆర్.కె సిల్క్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా శ్రీయ

పట్టు చీరల తయారీ, విక్రయాలకు ప్రసిద్ధి చెందిన వి ఆర్ కె సిల్క్స్‌కు నటి శ్రీయా శరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు..

సాక్షి, హైదరాబాద్: పట్టు చీరల తయారీ, విక్రయాలకు ప్రసిద్ధి చెందిన వి ఆర్ కె సిల్క్స్‌కు  నటి శ్రీయా శరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని సోమవారం నాడిక్కడ జరిగిన మీడియా సమావేశంలో కంపెనీ డెరైక్టర్ రాజేంద్రకుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా నటి శ్రీయ మాట్లాడుతూ ప్రత్యేక శ్రధ్ధతో చేనేత కళాకారులు తీర్చిదిద్దుతున్నందునే సంప్రదాయ పట్టు చీరలు అద్భుతంగా ఆకట్టుకుంటాయన్నారు.
 
  కంపెనీ డెరైక్టర్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ తమ చీరలకు గత కొంతకాలంగా రెగ్యులర్ కస్టమర్‌గా ఉన్న శ్రీయా శరణ్ తమ బ్రాండ్ ప్రమోషన్‌కు సరైన ఎంపికగా పేర్కొన్నారు. సిసలైన కంజివరం పట్టు చీరలకు మారు పేరుగా నిలిచిన తమ సంస్థ అన్ని రకాల పట్టు వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తోందని తెలిపారు. ఇప్పటికే 11 షోరూమ్‌లను నిర్వహిస్తున్న విఆర్‌కె సిల్క్స్‌ను  ఈ ఏడాది చివరకు విశాఖపట్టణం, నెల్లూరు, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, పూణే, అహ్మదాబాద్ తదితర నగరాలకు సైతం విస్తరించనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement