బ్యాంకుల రేటింగ్‌లలో కోత | Should Investors Be Concerned? Yes. Panic? No. | Sakshi
Sakshi News home page

బ్యాంకుల రేటింగ్‌లలో కోత

Feb 17 2016 12:24 AM | Updated on Sep 3 2017 5:46 PM

బ్యాంకుల రేటింగ్‌లలో కోత

బ్యాంకుల రేటింగ్‌లలో కోత

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రేటింగ్ అంచనాలను స్థిర స్థాయి నుంచి నెగెటివ్ స్థాయికి తగ్గించినట్లు ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ సంస్థ తెలిపింది.

ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ) రేటింగ్ అంచనాలను స్థిర స్థాయి నుంచి నెగెటివ్ స్థాయికి తగ్గించినట్లు ఎస్‌అండ్‌పీ రేటింగ్స్ సంస్థ తెలిపింది. రాబోయే ఏడాదిన్నర కాలంలో మొండి బకాయిల భారం మరింత పెరగొచ్చన్న అంచనాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కొంత పటిష్టమైన, ప్రభుత్వం నుంచి మద్దతు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్న బ్యాంకుగా సూచిస్తూ..  స్వల్పకాలికంగా ‘ఏ-3’, దీర్ఘకాలికంగా ‘బీబీబీ మైనస్’ రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ క్రెడిట్ అనలిస్టు అమిత్ పాండే చెప్పారు.
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ను(ఐవోబీ) కూడా ప్రతికూల అంచనాలతో.. ప్రత్యేకంగా గమనించాల్సిన విభాగంలోకి(క్రెడిట్‌వాచ్) ఎస్‌అండ్‌పీ చేర్చింది. ఎన్‌పీఏలతో నష్టాలు మరింత పెరగొచ్చన్న అంచనాలు దీనికి కారణం. ఐవోబీకి దీర్ఘకాలికంగా ‘బిబిప్లస్’, స్వల్పకాలికంగా ‘బి’ రేటింగ్ ఉంది. ఐడీబీఐ బ్యాంకునకు బిబిప్లస్ దీర్ఘకాలిక రేటింగ్‌ను ఇస్తున్నట్లు ఎస్‌అండ్‌పీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement