లాభాల స్వీకరణ : మార్కెట్ల వెనకడుగు

Sensex, Nifty Give Up Early Gains As IT Stocks Sag - Sakshi

సాక్షి, ముంబై: లాభాలతో  ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో  దాదాపు 100పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ అమ్మకాల ఒత్తిడితో కుదేలవుతోంది.  194 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్‌ 35,911 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి10,763 వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిల (సెన్సెక్స్‌ 36వేలు, నిఫ్టీ 10800 స్థాయి) దిగువకు చేరాయి. 

ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో రియల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్‌ బలహీనంగాఉన్నాయి. అటు మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ  స్వల్పంగా లాభాపడుతున్నాయి.  మెటల్‌ కౌంటర్లలో హిందాల్కో, ఎన్‌ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, వేదాంతా, హింద్‌ కాపర్‌ 2-1 శాతం మధ్య  లాభపడ్డాయి.  ఇక ఐటీ షేర్లు టీసీఎస్‌, మైండ్‌ట్రీ, టాటా ఎలక్సీ, నిట్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌ కూడా నష్టపోతున్నాయి.   రియల్టీ కౌంటర్లలో శోభా డీఎల్‌ఎఫ్‌, ఒబెరాయ్‌, ప్రెస్టేజ్‌, ఇండియాబుల్స్‌, సన్‌టెక్‌  నష్టపోతున్నాయి. వీటితోపాటు  టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ, ఇండస్‌ఇండ్, ఇన్‌ఫ్రాటెల్‌, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్ఎం, గెయిల్‌, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఐఎల్‌ లాంటి దిగ్గజాలు బలహీనంగా ఉన్నాయి.  మరోవైపు  ఐటీసీ, యూపీఎల్‌,  ఓఎన్‌జీసీ, ఐవోసీ, గ్రాసిమ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌పీసీఎల్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top