ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

SBI MD Anshula Kant appointed World Bank CFO and MD  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (ఎస్‌బీఐ) మేనేజింగ్ డైరెక్టర్ అన్షులా కాంత్ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మాల్పాస్ శుక్రవారం ఒక​ ప్రకటన జారీ చేశారు. గత ఏడాదే  కాంత్ ఎండీగా నియమితులైన సంగతి తెలిసిందే.

అన్షులా కాంత్‌ను ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎండీ, సీఎఫ్ఐగా నియమించడం సంతోషంగా ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. ఎస్‌బీఐ ఎండీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా  ఉన్న ఆమె సుమారు 38 బిలియన్ డాలర్ల (రూ.2.3 లక్షల కోట్లు) ఆదాయాన్ని, 500 బిలియన్ డాలర్ల (రూ.35 లక్షల కోట్లు) ఆస్తులను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.  ఆమెకు ఫైనాన్స్, బ్యాంకింగ్ సహా బ్యాంకింగ్ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్నివినూత్నంగా ఉపయోగించడంలో 35 అనుభవం ఉందన్నారు. ఈ నేపథ్యంలో తన విధులను విజయవంతంగా కొనసాగిస్తారనే విశ్వాసాన్ని డేవిడ్‌ మల్పాస్‌ వ్యక్తంచేశారు.  ప్రపంచ బ్యాంకు ఎండీ, సీవోవోగా కాంత్ ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఆర్థిక, రిస్క్ మేనేజ్‌మెంట్ బాధ్యత వహిస్తారు, రాష్ట్రపతికి నివేదిస్తారని తెలిపారు. అన్షులాకు ఉన్న అనుభవం నేపధ్యంలో ఆమెకు సాధారణ నిర్వాహణ వ్యవహారాలతో పాటు ఫైనాన్షియల్ రిపోర్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్‌ బాధ్యతలను అప్పగించామన్నారు.

కాగా  లేడీ శ్రీరాం కాలేజ్ ఫర్ విమెన్ నుంచి ఎకనమిక్స్ హానర్స్  చేసిన అన్షులా కాంత్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1960లో జన్మించిన ఆమె 1983లో ఎస్‌బీఐ బ్యాంకులో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా పనిచేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top