ఎస్‌బీహెచ్‌ సీజీఎంగా మణి పాల్వేశన్‌ | SBI, Chief General Manager Mani palvesan | Sakshi
Sakshi News home page

ఎస్‌బీహెచ్‌ సీజీఎంగా మణి పాల్వేశన్‌

Jan 3 2017 1:38 AM | Updated on Sep 5 2017 12:12 AM

ఎస్‌బీహెచ్‌ సీజీఎంగా మణి పాల్వేశన్‌

ఎస్‌బీహెచ్‌ సీజీఎంగా మణి పాల్వేశన్‌

ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ) మణి పాల్వేశన్‌ విధుల్లో చేరారు.

హైదరాబాద్‌: ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ) మణి పాల్వేశన్‌ విధుల్లో చేరారు. డిసెంబర్‌ 31న ఎస్‌బీహెచ్‌ ఎండీగా రిటైరయిన శంతను ముఖర్జీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. 1982లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన మణి.. ఆ తర్వాత వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఎస్‌బీఐ హాంకాంగ్‌ బ్రాంచ్‌ సీఈవో, ఎస్‌బీఐ క్యాప్‌ సెక్యూరిటీస్‌ ఎండీ తదితర హోదాల్లో సేవలు అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement