శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు హెచ్చరిక

Samsung Phones Are Randomly Sending Owners Photos To Contacts - Sakshi

సియోల్‌ : శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎవరైతే వాడుతున్నారో  వారు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. కొన్ని డివైజ్‌లు, మొబైల్‌ యూజర్లు స్టోర్‌ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండానే.. స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నాయని తెలిసింది. కనీస హెచ్చరికలు కానీ, అనుమతి కానీ లేకుండా ఇలా జరుగుతుందని వెల్లడైంది. శాంసంగ్‌ మెసేజస్‌ కలిగి ఉన్నవారికి ఈ సమస్య తలెత్తుతున్నట్టు గిజ్‌మోడో తొలుత రిపోర్టు చేసింది. ఫైల్స్‌ను పంపుతున్నప్పటికీ, దాన్ని యూజర్లకు కూడా తెలుపడం లేదని రిపోర్టు పేర్కొంది. 

శాంసంగ్‌ ఫోన్లలో శాంసంగ్‌ మెసేజస్‌ అనేది డిఫాల్ట్‌ మెసేజింగ్‌ యాప్‌. దీనిలోని బగ్‌ కారణంగా ఈ సమస్య తలెత్తుతున్నట్టు తెలిసింది. గెలాక్సీ ఎస్‌9, గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ డివైజ్‌లు దీని బారిన పడ్డాయని, కేవలం రెండు మోడల్స్‌కు మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదని వెర్జ్‌ రిపోర్టు చేసింది. తాజాగా వస్తున్న రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని, తమ టెక్నికల్‌ టీమ్స్‌ దీన్ని విచారిస్తున్నాయని శాంసంగ్‌ ప్రకటన విడుదల చేసింది. దీని బారిన పడిన కస్టమర్లు 1-800-SAMSUNG  వద్ద తమను డైరెక్ట్‌గా కాంటాక్ట్‌ చేయాల్సిందిగా శాంసంగ్‌ కోరింది. అనుమతి లేకుండా ఫోటోలను, డేటాను కాంటాక్ట్‌లకు పంపే బగ్‌ బారిన పడకుండా ఉండేందుకు, శాంసంగ్‌ మెసేజస్‌ అనుమతులను యూజర్లు ఉపసంహరించుకోవచ్చని శాంసంగ్‌ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top