లాట్ మొబైల్స్ స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్ | Samsung Galaxy Alpha: First impressions of Samsung's expensive mini phone | Sakshi
Sakshi News home page

లాట్ మొబైల్స్ స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్

Sep 29 2014 1:17 AM | Updated on Sep 2 2017 2:04 PM

లాట్ మొబైల్స్ స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్

లాట్ మొబైల్స్ స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్

మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి సందర్భంగా స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్‌ను ప్రకటించింది.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మల్టీబ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్ లాట్ మొబైల్స్ దసరా, దీపావళి సందర్భంగా స్మార్ట్ ఫెస్ట్ ఆఫర్స్‌ను ప్రకటించింది. 50% అస్యూర్డ్ బైబ్యాక్ ఆఫర్‌లో లాట్ కస్టమర్లు 6 నెలలలోపు ఎప్పుడైనా తమ ఫోన్ కొన్న ధరలో 50% ధరతో ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఫోన్‌ను కొనుక్కోవచ్చు. 15 రోజుల ట్రయల్ పీరియడ్ ఆఫర్‌ను సైతం లాట్ మొబైల్స్ ప్రవేశపెట్టింది.

ఫోన్ నచ్చకపోతే కొన్న తేదీ నుండి 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి వేరే బ్రాండ్ మొబైల్‌ను తీసుకోవచ్చు. బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై 2 సంవత్సరాల ఎక్స్‌టెండెడ్ నేషనల్ వారెంటీ అందిస్తున్నారు. ఎంపిక చేసిన ఫోన్లపై డిస్కౌంట్, స్మార్ట్ ఫెస్ట్‌లో ప్రతి కొనుగోలుపై ఖచ్చిత బహుమతి ఉంది. డిసెంబరుకల్లా మరో 25 షోరూంలను తెరుస్తున్నట్టు లాట్ ప్రతినిధి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement