
సాక్షి, ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్‌జియో ఐపీవోకు రానుందన్న వార్తలను రిలయన్స్ కొట్టిపారేసింది. త్వరలోనే జియో ఐపీవోకు సిద్ధమవుతోందన్నవార్తలపై స్పందించిన రిలయన్స్ ఇవి ఊహాజనితమని, ఇదంతా మీడియా సృష్టిఅని తేల్చి పారేసింది.
టెలికాం రంగంలోకి ప్రకంపనలు సృష్టించిన రిలయన్స్ జియో ఐపీవోకి రానుందన్న ఊహాగానాలు మార‍్కెట్ వర్గాల్లో బాగా వ్యాపించాయి. రిలయన్స అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని జియో భారీ ప్రణాళికలతో ఐపీవోకి రానుందని అంచనా భారీగా నెలకొంది. దీంతో సమీప భవిష్యత్తులో అలాంటి ప్రణాళికలు ఏవీ లేవని క్లారిటీ ఇచ్చింది. అలాగే రుణాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉందని, భవిష్యత్ విస్తరణపై దృష్టిపెట్టినట్లు కంపెనీ సీనియర్ అధికారులు తెలిపారు.
కాగా రిలయన్స్ జియో పబ్లిక్ ఆఫర్(ఐపీఓ)కు సన్నాహాలు మొదలుపెట్టిందనీ, దీనిపై అంతర్గతంగా దీనిపై చర్చలు కూడా జరుపుతున్నట్లు ‘బ్లూంబర్గ్’ వార్త సంస్థ నివేదించింది. వచ్చే ఏడాది ఆఖరికల్లా లేదా 2019 తొలినాళ్లలో జియోను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించిందిన సంగతి తెలిసిందే.