ఆ డిపాజిటర్లకు భారీ ఊరట..

Relief For PMC Bank Depositors With RBI Fresh Directions - Sakshi

ముంబై : సంక్షోభంలో కూరుకుపోయిన పీఎంసీ బ్యాంక్‌కు చెందిన వేలాది డిపాజిటర్లకు భారీ ఊరట లభించింది. పీఎంసీ కేసులో ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేసి వాటి వేలానికి అవసరమైన చర్యలను ఆర్బీఐ చేపట్టింది. ఈ ఆస్తుల విక్రయం దిశగా అటాచ్‌ చేసిన ఆస్తులను విడుదల చేసి వేలం ప్రక్రియకు మార్గం సుగమం చేయాలని ఈఓడబ్య్లూను ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ర్టేటర్‌ కోరారు. ఆర్బీఐ నిర్ణయం పీఎంసీ బ్యాంకులో తమ సొమ్మును పొదుపు చేసుకున్న వేలాది డిపాజిటర్లకు ఊరట కల్పించింది. ఆర్బీఐ అడ్మినిస్ర్టేటర్‌కు ఆస్తులను అప్పగించేందుకు అనుమతించాలని ముంబై పోలీసులు న్యాయస్ధానాన్ని కోరనున్నారు. బ్యాంకు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్వాన్స్‌ సైతం ఆస్తుల వేలానికి అంగీకరించారు. ఈ కేసులో రూ 3500 కోట్లు పైగా ఆస్తులను ఈఓడబ్ల్యూ అటాచ్‌ చేసింది. మరోవైపు ఆస్తుల వేలం ద్వారా సమకూరిన సొమ్మును ప్రొ రేటా ప్రాతిపదికన డిపాజిటర్లకు పంచనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top