జియో కస్టమర్లకు శుభవార్త

Reliance Jio Launches Free Voice Calls Over WiFi - Sakshi

ముంబయి : రిలయన్స్‌ జియో కస్టమర్లకు మరో శుభవార్త.  వైఫై ద్వారా వాయిస్‌, వీడియో కాల్స్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిలయన్స్‌ జియో బుధవారం ప్రకటించింది. దీనికి అధనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని  తెలిపింది. భారతదేశంలో ఉన్న ఏ వైఫై నెట్‌వర్క్‌లో అయినా ఈ సర్వీస్‌ పనిచేయనుంది. ప్రసుత్తం 150 రకాల స్మార్ట్‌ ఫోన్లలో వైఫై ద్వారా వాయిస్‌ కాల్స్‌, వీడియో కాల్స్‌ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్‌ సౌలభ్యం దేశ వ్యాప్తంగా జనవరి 7 నుంచి 16 మధ్యలో అందుబాటులోకి రానుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్‌ సపోర్ట్‌ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు jio.com వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. జియో వైఫై కాలింగ్‌ ఉపయోగించాలంటే స్మార్ట్‌ఫోన్లలో కొన్ని సెట్టింగ్స్‌ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు భారతీ ఎయిర్‌టెల్‌  ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే  ' ఎయిర్‌టెల్‌ వైఫై కాలింగ్‌' పేరుతో సదుపాయాన్ని కల్పించింది. తాజాగా జియో మాత్రం ఉచిత వైఫై కాలింగ్‌ సదుపాయాన్ని పాన్‌ ఇండిలో కల్పించనుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top