శేషసాయి విరాళం రూ. 10 కోట్లు | R Seshasayee donated Rs 10 crore for TN relief | Sakshi
Sakshi News home page

శేషసాయి విరాళం రూ. 10 కోట్లు

Dec 16 2015 2:13 PM | Updated on Sep 3 2017 2:06 PM

శేషసాయి విరాళం రూ. 10 కోట్లు

శేషసాయి విరాళం రూ. 10 కోట్లు

వరదలతో అతలాకుతలమైన చెన్నై వాసులకు ఆపన్నహస్తం అందించేందుకు విరాళాలు వెల్లువెత్తున్నాయి.

చెన్నై: వరదలతో అతలాకుతలమైన చెన్నై వాసులకు ఆపన్నహస్తం అందించేందుకు విరాళాలు వెల్లువెత్తున్నాయి. బాధితుల పునరావాసం, సహాయ కార్యక్రమాల కోసం ఇప్పటివరకు రూ. 130.33 కోట్లు విరాళాలు వచ్చినట్టు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. తాజాగా అగ్రశేణి కార్పొరేట్ కంపెనీలకు చెందిన ఇద్దరు ప్రముఖులు రూ. 16 కోట్లు సహాయం చేశారు.

ఇన్ఫోసిస్ లిమిటెడ్ చైర్మన్ ఆర్ శేషసాయి రూ. 10 కోట్లు, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రూ. 6.50 కోట్లు ముఖ్యమంత్రి జయలలితకు అందజేసినట్టు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ నుంచి కురిసిన భారీ వర్షాలతో తమిళనాడులో 300 మందిపైగా మృతి చెందారు. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. బాధితులను ఆదుకునేందుకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యులు తమకు తోచిన రీతిలో సహాయం అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement