మరో డేటా బ్రీచ్‌: 10 కోట్ల కస్టమర్ల డేటా గోవిందా!

Quora hit by security breach, hackers steal up to 100 million users data - Sakshi

పాపులర్‌ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ వెబ్‌సైట్‌లో భారీ హ్యాకింగ్‌

క్వోరాలో 100 మిలియన్ల  కస్టమర్ల డేటా చోరీ

దర్యాప్తు చేస్తున్న సంస్థ

ఫేస్‌బుక్‌లో డేటా లీక్‌ ఉదంతం ప్రకంపనలు ఇంకా సమసిపోకముందే తాజాగా డేటా బ్రీచ్‌ ఆందోళన పుట్టిస్తోంది. ప్రముఖ వెబ్‌సైట్‌ క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ (క్వోరా) హ్యాకింగ్‌కు  గురైంది. ఈ విషయాన్ని స్వయంగా క్వోరానే వెల్లడించింది. ఈ నేపథ్యంలో క్వోరాఖాతాదారులు తమ తమ పాస్‌వర్డ్‌లను మార్చుకోవాల్సిందిగా కోరింది. అలాగే హ్యాకింగ్‌కు గురైన వినియోగదారులకు సమాచారం ఇస్తున్నట్టు తెలిపింది.

సుమారు10కోట్లమంది(100 మిలియన్లు) వినియోగదారుల డేటా చోరికి గురైందని తెలిపింది.  గుర్తు తెలియని  హ్యాకర్లు "ఒక హానికర మూడవ పక్షం" ద్వారా   తమ వ్యవస్థలోకి చొరబడ్డారని  ప్రకటించింది.  నవంబరు 30న దీన్నిగుర్తించామనీ,  విచారణ కొనసాగుతోందని ప్రకటించింది.  పేరు, ఇమెయిల్ చిరునామా, ఎన్‌క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌లు, లింక్డ్ నెట్‌వర్క్‌లో రిపోర్ట్‌ చేసిన డేటాతో సహా చోరి  యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ అయిందని కంపెనీ సీఈవో ఆడమ్‌ డీ ఎంజేలో తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించారు.

కాగా  ఫేస్‌బుక్‌  మాజీ ఉద్యోగులు ఆడమ్‌ డీఎంజేలో, చార్లీ చీవర్‌ 2009లో క్వోరా వెబ్‌సైట్‌ ఏర్పాటు చేశారు.  సోషల్‌ మీడియాలో (పేస్‌బుక్, ట్వీటర్,వాట్సాప్‌) సహా పలు రంగాల్లోని ప్రశ్నలకు జవాబు అందించేలా దీన్ని అభివృద్ధి చేశారు.  తద్వారా అతితక్కువ కాలంలోనే ముఖ్యంగా యువతలో ఈ వెబ్‌సైట్‌ అత్యంత ఆదరణ పొందింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top