పోర్షే 911 కొత్త వెర్షన్ | Porsche launches new 911 model priced up to Rs 2.66 crore | Sakshi
Sakshi News home page

పోర్షే 911 కొత్త వెర్షన్

Jun 30 2016 12:46 AM | Updated on Sep 4 2017 3:43 AM

పోర్షే 911 కొత్త వెర్షన్

పోర్షే 911 కొత్త వెర్షన్

జర్మనీ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘పోర్షే’ తాజాగా ‘911 మోడల్’లోనే కొత్త వె ర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ప్రారంభ ధర రూ.1.42 కోట్లు  హైదరాబాద్‌లో ఔట్‌లెట్!
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘పోర్షే’ తాజాగా ‘911 మోడల్’లోనే కొత్త వె ర్షన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని ధర శ్రేణి రూ.1.42 కోట్లు-రూ.2.66 కోట్లుగా (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) ఉంది. ‘911 మోడల్’ కరెరా క్యాబ్రియోలెట్, కరెరా ఎస్, టర్బో, టర్బో ఎస్ క్యాబ్రియోలెట్ అనే నాలుగు వేరి యంట్లలో లభ్యంకానున్నది. తాజా అప్‌డేటెడ్ వెర్షన్ 911 మోడల్‌కు చెందిన 8వ జనరేషన్ వెహికల్ అని కంపెనీ తెలిపింది. గత వెర్షన్లతో పోలిస్తే తాజా వెహికల్ 12% అధిక మైలేజీ అందిస్తుందని పేర్కొంది. భారత్‌లో కార్యకలాపాల విస్తరణ కోసం పోర్షే  త్వరలో చెన్నై, హైదరాబాద్‌లో కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేయనున్నది. ప్రస్తుతం కంపెనీకి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, కోల్‌కతా, కొచ్చి ప్రాంతాల్లో ఔట్‌లెట్స్ ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement