పీఎన్‌బీ స్కాం : రోడ్డున పడబోతున్న ఉద్యోగులు

PNB scam: Mehul Choksi's Gitanjali Gems to shut down - Sakshi

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ కుంభకోణం గీతాంజలి జెమ్స్‌ ఉద్యోగులకు ఎసరు తెచ్చి పెట్టింది. నీరవ్‌ మోదీ అంకుల్‌ మెహుల్‌ చౌక్సికి చెందిన ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవింగ్‌ లెటర్లు తీసుకోవాలంటూ గీతాంజలి జెమ్స్‌ కోరింది. ఈ నేపథ్యంలో గీతాంజలి జెమ్స్‌ను మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో పాల్పడిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో నీరవ్‌ మోదీ, ఆయన అంకుల్‌ మెహుల్‌ చౌక్సిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. ఈ స్కాం వెలుగులోకి రాకముందే నీరవ్‌ మోదీ, చౌక్సి దేశం విడిచి పారిపోయారు. 

అయితే పీఎన్‌బీ మోసంలో చౌక్సి ప్రమేయాన్ని గీతాంజలి జెమ్స్‌ ఖండిస్తోంది. చౌక్సికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మోదీకి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలు కూడా తప్పుడువేనంటూ నీరవ్‌ మోదీ న్యాయవాది విజయ్‌ అగర్వాల్‌ పేర్కొంటున్నారు.  ''ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడటం లేదు. అన్ని కేసుల్లో ఇదే జరుగుతుంది. బోఫోర్స్ కేసులో, 2జీ కేసులో, బొగ్గు కుంభకోణం కేసులో ఇదే జరిగింది. ఈ కేసులో కూడా ఇదే జరుగుతుంది. ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడరు'' అని అగర్వాల్‌ అన్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top