వ్యాపార విశ్వాసం దిగువకు! | Sakshi
Sakshi News home page

వ్యాపార విశ్వాసం దిగువకు!

Published Tue, Apr 17 2018 1:05 AM

PNB scam, fiscal slippage dent biz optimism in June quarter - Sakshi

ముంబై: జూన్‌ త్రైమాసికానికి సంబంధించి కార్పొరేట్ల వ్యాపార విశ్వాసం తగ్గింది. రూ.13,000 కోట్ల పీఎన్‌బీ కుంభకోణం, ద్రవ్యలోటు కట్టుతప్పడం వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ‘గతేడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో విశ్వాసం పెరిగింది. ఇది తర్వాత 2018 తొలి త్రైమాసికంలో 91 శాతం గరిష్ట స్థాయికి ఎగసింది. అయితే రెండో త్రైమాసికంలో 6.6 శాతం క్షీణతతో 85 శాతానికి తగ్గింది’ అని ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ కంపెనీ డాన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ తన నివేదికలో పేర్కొంది.

ఇప్పటికే మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకుల్లో కుంభకోణాలు చోటుచేసుకోవడం, ద్రవ్యలోటు కట్టుతప్పడం వంటి అంశాలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయని తెలిపింది. వీటితోపాటు పీఎన్‌బీ కుంభకోణం నేపథ్యంలో ఎల్‌ఓయూల నిలుపుదల, అమెరికా రక్షణాత్మక విధానాలు అనుసరించడం కూడా ఆందోళనలకు ఆజ్యం పోశాయని పేర్కొంది.

ఈ అంశాలన్నీ కంపెనీల సెంటిమెంట్‌ను దెబ్బ తీశాయని పేర్కొంది. అయితే అప్టిమిజమ్‌ ఇండెక్స్‌లో వార్షిక ప్రాతిపదికన 7.6% వృద్ధి నమోదయ్యిందని తెలిపింది. రంగాల వారీగా చూస్తే ఇంటర్మీడియట్‌ గూడ్స్‌ అత్యంత ఆశావహ రంగంగా అవతరించిందని పేర్కొంది. ఇక నిర్మాణ రంగం చివరిలో నిలిచిందని తెలిపింది.  

Advertisement
Advertisement