దిగ్గజాలకు దిగులే వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీలు త్వరలో

OnePlus TV India launch likely Around Mid 2019 - Sakshi

షావోమికి షాకే : వన్‌ప్లస్‌ స్మార్ట్‌ టీవీలు

2019 మేలో లాంచ్‌ చేసే అవకాశం

ముంబై: స్మార్ట్‌ఫోన్‌ రంగంలో తనదైన శైలితో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్‌  టీవీ రంగంలో కూడా అడుగుపెట్టనుంది. గత సెప్టెంబర్‌ 14నే తమ కంపెనీ నుంచి స్మార్ట్‌టీవీ రానుందని వన్‌ప్లస్‌ సీఈవో పీటే లౌ తెలిపారు. దాని తర్వాత టీవీ గురించి ఎటువంటి ప్రకటనా రాలేదు.

తాజాగా లౌ మాట్లాడుతూ టీవీని 2019 మధ్యలో మార్కెట్‌లో రిలీజ్‌ చేస్తామని తెలిపారు. వచ్చే సంవత్సరం క్రికెట్‌ ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకొని మే నెలలోనే రిలీజ్‌ చేయాలనుకున్నామన్నారు.  కానీ స్థాయికి తగ్గ ప్రొడక్ట్‌ను తయారు చేయాలని నిశ్చయించున్నాం కాబట్టి కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని తెలిపారు. 
 
వన్‌ప్లస్‌ మొబైల్స్‌లాగే, టీవీ సేల్స్‌ కూడా అమెజాన్‌ ద్వారా అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ అన్నారు. వన్‌ప్లస్‌ మొబైల్‌తో అనుసంధానం చేసేలా టీవీని తయారుచేస్తున్నట్లు సమాచారం. అమెజాన్‌ ప్రైమ్‌ సర్వీస్‌ ద్వారా సినిమాలు, షోలు చూసే సౌలభ్యం కల్పించనున్నారు. వన్‌ప్లస్‌ స్మార్ట్‌టీవీ రాక షావోమీకి గట్టి ఎదురుదెబ్బ అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top