నిమిషంలో అ‍మ్ముడుపోయిన చైనా ఫోన్‌!

One Plus 8 Pro Phones sell Out in Minutes - Sakshi

భారత్‌- చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా వస్తువులను నిషేధించాలనే ప్రచారం గత కొన్ని రోజులుగా ఊపందుకుంది. ముఖ్యంగా చైనా ఫోన్లను బహిష్కరించాలని, భారతదేశపు వస్తువులను ప్రోత్సహించాలని క్యాంపెయిన్‌ కూడా నిర్వహిస్తున్నారు. మేక్‌ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భర భారత్‌ నినాదాలు హోరెత్తుతున్నాయి. దీంతో చైనా కంపెనీలకు నష్టాలు తప్పవని అంతా భావించారు. ఈ క్రమంలోనే ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం చైనా కంపెనీ బీబీకె ఎలక్ట్రానిక్స్ విడుదల చేసిన వన్‌ప్లస్‌ 8 ప్రో హాట్‌ కేక్‌లాగా అమ్ముడైపోయింది. దీనికి తోడు తమకు ఫోన్‌ దొరకలేదని, అందుబాటులోకి మరిన్ని ఫోన్లను  తీసుకురావాలని కూడా ట్విట్టర్‌ వేదికగా కొందరు కంపెనీని కూడా కోరారు. (ప‌బ్జీ గేమ్ చైనాదేనా?)

దీంతో చైనా వస్తువుల వినియోగం ఇప్పటికీ దేశంలో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాదికి చైనాకు  ఇండియా నుంచి రూ. 3.8 లక్షల కోట్ల ఆదాయం లభిస్తోంది. చైనా ఫోన్లతో సెక్యూరిటీ సమస్య ఉందని, వాటిని బహిష్కరించాలనే వాదనలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీంతో ఇండియా కంపెనీలు లాభపడతాయని అంతా భావిస్తున్నారు. ఇది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. 

(చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top