ఆయిల్‌ ఇండియా షేర్ల బైబ్యాక్‌

Oil India to buy back 4.45% shares for Rs 1085 crore - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ ఇండియా షేర్లను బైబ్యాక్‌ చేయనున్నది. 4.45 శాతం వాటాకు సమానమైన మొత్తం 5.04 కోట్ల షేర్లను బైబ్యాక్‌ చేయడానికి డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని ఆయిల్‌ ఇండియా పేర్కొంది. ఒక్కో షేర్‌ను రూ.215 ధరకు బైబ్యాక్‌ చేస్తామని, ఈ షేర్ల బైబ్యాక్‌ విలువ రూ.1,085 కోట్ల వరకూ ఉండొచ్చని వివరించింది.

షేర్ల బైబ్యాక్‌ ద్వారా రూ.5,000 కోట్లు ! 
ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ప్రభుత్వం నగదు నిల్వలు భారీగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలపై కన్నేసింది. అధిక డివిడెండ్లు చెల్లించాలని, లేదా షేర్ల బైబ్యాక్‌ చేయాలని ఆయా సంస్థలపై కేంద్రం ఒత్తిడి తెస్తోంది. ఈ సంస్థల్లో సహజంగానే ప్రభుత్వానికి అధిక వాటా ఉండటంతో డివిడెండ్లు చెల్లించినా, షేర్ల బైబ్యాక్‌ జరిపినా, కేంద్ర ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తుంది. ఇక ప్రభుత్వ రంగ కంపెనీల షేర్ల బైబ్యాక్‌ ద్వారా కనీసం రూ.5,000 కోట్లు రా 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top